కట్నం గురించి సుప్రీం కోర్ట్ లో దాఖలైన ఒక పిటిషన్ కు సంబంధించి కోర్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇక నుంచి ఎవరైనా కట్నం తీసుకుంటే రిజిస్టేషన్ లో చెప్పవలసి రావచ్చేమో అనే అనుమానాలు వ్యక్తం చేసింది. కొత్తగా పెళ్లయిన జంట తమ మ్యారేజ్ రిజిస్టేషన్ సమయంలో పెళ్ళికి అయిన ఖర్చుల వివరాలు, బంగారం, గిఫ్టులు, అత్త వారు అల్లుడుకి లేదా కూతురికి ఎంత భరణం ఇచ్చారో చెప్పి అవి రిజిస్టేషన్ లో నమోదు చేసుకుంటే భవిష్యత్తులో గొడవలు జరిగినా ఈజీగా పరిష్కరించుకోవచ్చని సుప్రీం కోర్ట్ తెలిపింది.

అందుకే కొత్తగా పెళ్ళైన జంట తమ మ్యారేజ్ రిజిస్టేషన్ లో ఈ విషయాలు తెలియచేయాలన్న నిబంధనలపై కేంద్రం తమ అభిప్రాయాలను తెలియచేయాలని సుప్రీం కోర్ట్ కేంద్రాన్ని ఆదేశించింది. కానీ ఇలా నేరుగా కట్నం ఎంత ఇచ్చారో, ఎంత పుచ్చుకున్నారో మ్యారేజ్ రిజిస్టేషన్ లో ఎంటర్ చేస్తే అది వరకట్నం కిందకు వస్తుందని న్యాయ నిపుణులు తెలియచేస్తున్నారు. కానీ ఎవరైనా తీసుకున్న వారు ఇచ్చిన వారు ఇలా మ్యారేజ్ రిజిస్టేషన్ లో పొందు పరచమంటే ఎవరు ముందు వస్తారు చెప్పండి.

Tags : Suprem Court, Dowry, Marriage Registration, Central Government, Newly Married Couple