Tuesday, September 10, 2024

నారా లోకేష్ యువగళం అంటేనే పారిపోతున్న తమ్ముళ్లు

- Advertisement -

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించే బాధ్యత తీసుకున్నారాయన. దీనిలో భాగంగానే ఆయన యువగళం పేరిట పాదయాత్ర చేయడానికి సిద్దం అవుతున్నారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా కూడా గెలవని నారా లోకేష్ పార్టీని గెలిచించడం ఏమిటని రాజకీయ పరిశీలకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేయడానికి నారా లోకేష్ సిద్దం అవుతున్నారు. జనవరి 27 నుంచి ఈ పాదయాత్ర మొదలుకానుంది. ఈ నెల 27న కుప్పంలో స‌రిగ్గా 12.03 గంట‌ల‌కు శుభ ముహూర్తాన పాద‌యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ పాద‌యాత్ర‌లో 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌లు, పొలిట్‌బ్యూరో స‌భ్యులు, అధికార ప్ర‌తినిధులు ఈ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు టీడీపీ నేతలకు ఎక్కడ లేని కష్టం వచ్చి పడింది. నారా లోకేష్ పాదయాత్ర ఏమో కాని టీడీపీ నాయకులకు జేబులు గుల్ల అయ్యే పరిస్థితి వచ్చింది. నారా లోకేష్ చేపట్టబోయే పాదయాత్ర ఖర్చులన్ని కూడా టీడీపీ నేతలే భరించాల్సి ఉంటుందని తెలుస్తుంది. పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా రాదని..ఖర్చులంతా కూడా టీడీపీ నాయకులే పెట్టుకోవాలని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారట. లోకేష్ ఏ నియోజకవర్గంలో అయితే పాదయాత్ర చేస్తారో.. ఆ నియోజవకర్గం ఇంచార్జే ఖర్చులు మొత్తం భరించాల్సి ఉంటుందని తెలుస్తోంది. లోకేష్ పాదయాత్రకు భారీగా ప్రజలను తరలించాల్సి ఉంటుంది. ప్రజలు వారి పని మానుకుని రారు కాబట్టి.. వారికి డబ్బులిచ్చి తరలించాల్సి ఉంటుంది.. వారి దారి ఖర్చులు, భోజనాల ఖర్చులు ఇలా చూసుకుంటే నియోజకవర్గ ఇంచార్జ్‌కు తడిసిపోతుందని అంటున్నారు.

సరే ఖర్చుపెడదాం అంటే టికెట్ తనకే వస్తుందని గ్యారెంటీ లేదు. టీడీపీలో ఎప్పుడు ఎవరికి టికెట్ వస్తుందో తెలియని పరిస్థితి. డబ్బులు ఎక్కువ ఎవరి దగ్గర ఉంటే వారికి టికెట్లు కేటాయింస్తుంటారు. దీనికి తోడు ఇప్పుడు జనసేన పొత్తు కూడా టీడీపీ నేతల్లో కొత్త భయం పట్టుకుంది. ఒకవేళ పొత్తు ఉంటే ఎవరి సీట్లకు ఎసరు వస్తుందో తెలియని పరిస్థితి. మరి అలాంటడప్పుడు ఎందుకు ముందుగానే ఖర్చు పెట్టాలని నాయకులు తమను తామే ప్రశ్నించుకుంటున్నారు. నారా లోకేష్ పాదయాత్ర విషయంలో నాయకులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరి నారా లోకేష్ యువగళ.. ఎవరికి యమగళంగా మారుతుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!