Tuesday, September 10, 2024

ఆపరేషన్ గుడివాడ .. టీడీపీ భారీ స్కెచ్…

- Advertisement -

టీడీపీ అధినేత మదిలో ఒకటే ఆలోచనగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన రాకపోయిన, తాను సీఎం అయిన అవకపోయిన ఫర్వాలేదు కాని 2024లో జరిగే ఎన్నికల్లో మాత్రం.. గుడివాడలో కొడాలి నాని మాత్రం గెలవడకూడదని చంద్రబాబు గట్టిగా ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తోంది. ఒకప్పుడు గుడివాడ టీడీపీ కంచుకోటగా ఉండేది. కాని గుడివాడలో కొడాలి నాని వచ్చిన తరువాత అక్కడ టీడీపీ సీన్ మొత్తం మారిపోయింది. పార్టీలకు అతీతంగా కొడాలి నాని తన వ్యక్తిగత ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఏ పార్టీ తరుఫున పోటీ చేసిన కూడా గెలుపు కొడాలిదే అన్నట్లుగా గుడివాడలో పరిస్థితి మారిపోయింది. గుడివాడను తన అడ్డగా మార్చుకున్నారు కొడాలి నాని. 2004 నుంచి ఇప్పటి వరకు వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారాయన.

టీడీపీ తరుఫున రెండుసార్లు, వైసీపీ తరుఫున మరో రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి కూడా అయ్యారు. గుడివాడలో కొడాలి నానికి చెక్ పెట్టాలని చంద్రబాబు కలలు కన్నారు. కాని ఆ కలలన్ని కూడా కలలుగానే మిగిలిపోయాయి. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తనలోని మరింత దూకుడును కొడాలి బయటపెట్టారు. వైసీపీ పార్టీలో జగన్ తరువాత అంతటి క్రేజ్ ఉన్నది కొడాలి నానికే అంటే అతిశేయోక్తికాదు. మంత్రి అయిన తరువాత తనలోని దూకుడును మరింత స్పీడు పెంచారాయన. టీడీపీ అధినేత చంద్రబాబును తిట్టడంలో కొడాలి నాని తరువాతే ఎవరైనా. తనని బుతుల మంత్రి అని అన్నప్పటికి కూడా ఐ డోంట్ కేర్ అని అంటారు కొడాలి. జగన్‌ను ఎవరైన విమర్శిస్తే చాలు పార్టీలో మొదట వినిపించేది కొడాలి నాని వాయిసే

ఆయన మీడియా సమావేశం పెట్టారంటే..ఆ రోజు చంద్రబాబుకు మూడినట్లే అని అందరు భావిస్తారు. తన మాటలతో చంద్రబాబు అండ్ కోని ఉచకోత కోస్తారాయన. చంద్రబాబును కొడాలి నాని తిట్టినంత బండబూతులు మరే నాయకుడు కూడా తిట్టి ఉండరు. గుడివాడలో టీడీపీకి కొడాలి నాని కొరకరాని కొయ్యగా మారారు అందుకే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గుడివాడలో కొడాలి నానిని ఓడించాలని చంద్రబాబు చూస్తున్నారు. కొడాలిని ఢీ కొట్టేందుకు స్పెషల్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కొడాలిపై పోటీకి ఎన్నైరైని రంగంలోకి దించుతున్నట్లుగా సమాచారం. వెనిగళ్ల రామును టీడీపీ తరుఫున గుడివాడ బరిలో దించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి.

వెనిగళ్ల రాము అభ్యర్థిత్వనికి చంద్రబాబు సైతం గ్రీన్ సీగ్నల్ ఇచ్చారట. కొన్నాళ్లుగా గుడివాడలోనే వెనిగళ్ల రాము కుటుంబం నివాసం ఉంటూ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. జనవరి నుంచి వెనిగళ్ల రాము నియోజకవర్గంలో పర్యటిస్తారని విశ్వసనీయ సమాచారం. వెనిగళ్ల రాముకు అమెరికాలో పలు వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ఆర్థికంగా బలంగా ఉండటంతో పాటు, కమ్మ సామాజికివర్గానికి చెందిన వ్యక్తి కావడం, ఆయన భార్య ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో..అటు వారి ఓట్లను కూడా కొల్లగొట్టవచ్చనే భావనలో చంద్రబాబు ఉన్నారు. దీనిలో భాగంగానే ఆపరేషన్ గుడివాడను మొదలుపెట్టారట చంద్రబాబు. వెనిగళ్ల రాముపై చంద్రబాబు చాలానే ఆశలు పెట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. అసలు వెనిగళ్ల రాము కొడాలి నానిని ఎదుర్కొనే సత్తా ఉందా అని తెలుగు తమ్ముళ్లే చర్చించుకుంటున్నారు. మరి ఈసారి అయిన గుడివాడలో కొడాలి నానిని ఓడిస్తారో లేదో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!