ఒక పార్టీని నమ్ముకున్న కార్యకర్త తనకు నచ్చిన పార్టీ కోసం ఎంత దూరమైనా వెళ్లడం చూసే ఉంటాం. కొంత మంది అయితే తనకు నచ్చిన నాయకుడి పేరు పచ్చ బొట్టు పొడిపించుకుంటారు. కొంత మంది హెయిర్ కట్ తో తమ అభిమానాన్ని చాటుకుంటారు. కానీ జనసేన అభిమానుల వెర్రి తారా స్థాయికి చేరి ఒక చిన్న పిల్లవాడికి జనసేన గుర్తును తలకు కటింగ్ చేయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్ట్ కు జనసేన అభిమానులంతా ఆహా, ఓహో అంటూ షేర్లు చేసుకుంటూ సంబరపడుతున్నారు. అభిమానం చాటుకోవడానికి చాల రకాల పద్ధతులు ఉంటాయి. ఒక పసివాడిపై ఇలాంటి పైశాచికత్వంగా జనసేన గుర్తు వేయడం ఎలా అర్ధం చేసుకోవచ్చు? ఇలాంటి పనులు ఏ పార్టీ చేసినా అది చాల పెద్ద తప్పు. ఆ పిల్ల వాడికి  గుర్తు వేయించిన కుటుంబసభ్యులు మా పిల్లడు మా ఇష్టం అనవచ్చు. కానీ ఇలాంటి వెర్రి వేషాలతో వికృత చేష్టలతో మీరు చేసే పనుల వల్ల సోషల్ మీడియా వేదికగా సామాన్య నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, సోషల్ మీడియాలి లైక్స్ కోసం ఇలాంటి వికృత చేష్టలు కొంత మంది చేస్తూ వారి శాడిజాన్ని చూపించడం చాల బాధాకరం