ఒక వ్యక్తి నచ్చితే తమ అభిమానులు ఎంత దూరమైనా వెళ్తారనడానికి ఈ అభిమాని చేసిన పనే నిదర్శనం. చిత్తూర్ కు జిల్లాకు చెందిన ఈశ్వర్ రాయల్ అనే వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని తిరుమల కొండపైకి పొర్లు దాడులతో ఎక్కాడు. సుమారు 2600 మెట్లను తాను ఎక్కి దర్శించుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని, అందుకే శ్రీవారి మెట్టు మార్గంలో ఇలా పవన్ కోసం పొర్లు దాడులతో మెట్లు ఎక్కానని, 2019 లో పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలని ఆకాంక్షించాడు.

తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి, సొంతగా జనసేన పార్టీని బలోపేతం చేస్తున్న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అనేక చోట్ల పవన్ అభిమానులు రక్తదాన శిబిరాలతో పాటు, అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. జనసేన పార్టీ లో చేరాలనుకునే వారు, వచ్చే ఎన్నికలలో జనసేన తరుపున టికెట్ ఆశిస్తున్న వారు కూడా నియోజకవర్గ కేంద్రాలలో బారి ఎత్తున అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.