Thursday, November 7, 2024

అన్ స్టాపబుల్‌ షోలో టీడీపీపై కౌంటర్ వేసిన పవన్..వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..?

- Advertisement -

అన్ స్టాపబుల్‌ షో ద్వారా కొత్త రాజకీయాలకు తెర లేపినట్లు అయింది. తాజాగా ఈ షోలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే బాలయ్య..పవన్‌ను ఎలాంటి ప్రశ్నలు అడిగి ఉంటారో అనేది అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ టార్గెట్ చేస్తూ ఈ షో అంత నడించిందని ప్రత్యక్ష సాక్ష్యులు తెలపడం జరిగింది. మొదట తాను చేసుకున్న మూడు పెళ్లిళ్ల గురించి పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారట. తరువాత నెమ్మదిగా రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలను పవన్‌ను అడిగారట బాలయ్య. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయినప్పుడు ఎలా అనిపించిందని..అసలు ఈ రాజకీయాలు మనకు ఎందుకు.. వెనక్కి వెళ్లిపోదాం అని ని ఎప్పుడైనా అనిపించిందా అనే ప్రశ్నలకు ఈ షోలో సమధానం ఇచ్చారట పవన్‌.

ఇక వచ్చే ఎన్నికల్లో మీ వ్యూహాలు ఏంటీ ఎలా ముందుకు వెళ్తున్నారని కూడా పవన్‌ను ప్రశ్నించారట. మాట్లాడితే వైసీపీ వారు మీకు 175 సీట్లలలో అభ్యర్థులు లేరు కదా అంటున్నారు.. నిజంగానే మీకు అభ్యర్థులు లేరా అంటూ వ్యంగ్యంగా పవన్‌ను ప్రశ్నించారట బాలకృష్ణ. ఇక ఇదే సమయంలో టీడీపీతో పొత్తు గురించి కూడా పవన్‌ను అడిగేసినట్లుగా తెలుస్తోంది. టీడీపీతో చేతులు కలుపుతారా అంటే .. దానికి కాలమే సమాధానం ఇస్తుందని పవన్ తెలిపారని తెలుస్తోంది. పొత్తుల గురించి తెలియకుండానే ఎలా సీఎం అవుతారని పవన్‌ను బాలయ్య ప్రశ్నించారని షోలో పాల్గొన్న ప్రేక్షకుడు ఒకరు తెలిపారు.

అధికార పార్టీ వ్యతిరేక ఓటు చీలనవ్వననే వ్యాఖ్యల పరమార్ధం టీడీపీతో కలిసి పని చేయడమే కదా అని పవన్‌తో బాలయ్య అన్నట్లుగా తెలుస్తోంది. పవన్ ఆలోచనలనే టీడీపీ తొలి నుంచి అమలు చేస్తుంది కదా అంటూ బాలయ్య ప్రశ్నించారు. దీనికి పవన్ తన స్టైల్ సమాధానం ఇచ్చారు. తాను అనుకున్న ఐడియాలజీ టీడీపీలో ఉంటే, తాను కొత్త పార్టీ ఎందుకు పెడతానంటూ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక వర్గం చేతిలో అధికారం ఉండకూడదు, ఇప్పటి వరకు అధికారం దక్కని వారి రాజ్యాధికారం దక్కించుకోవాలనేది తన లక్ష్యమని పవన్ చెప్పుకొచ్చారు. దీంతో బాలయ్య మొహం మాడిపోయినట్లుగా తెలుస్తోంది. మొత్తనికి షో మొత్తం కూడా తమకు అనుకులమైన ప్రశ్నలతో నింపేసినట్లుగా పక్కాగా తెలిసిపోతుంది. ఈ ఎపిసోడ్ జనవరిలో మొదటివారంలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!