125 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు.. దేశంలో తన ఉనికిని కాపాడుకోవడం కోసం తెగ తాపత్రయపడుతుంది. కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ జోడో యాత్ర పేరిట దేశం మొత్తాన్ని చూట్టేస్తున్నారు. పార్టీకి గత వైభవాన్ని తీసుకురావడానికి ఆయన దేశం మొత్తం పాదయాత్ర చేస్తున్నారు. గడిచిన రెండు ఎన్నికలలో దారుణంగా ఓడిపోయిన పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావడానికే ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అని అందరికి తెలిసిందే. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ 3500 కిలోమీటర్ల మేర సాగుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆయన 1000 కిలోమీటర్లను పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో ఏపీలో నాలుగు రోజుల పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. దీనిలో భాగంగానే ఆయన ఏపీలో తన పాదయాత్రను మూడోరోజు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం గురించి కామెంట్స్ చేశారు. తొలి సారిగా ఏపీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.
రాహుల్ గాంధీ ప్రస్తుతం కర్నూల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆదోని మండలం ఆరేకల్‌లో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ గాంధీ జగన్ సర్కార్ మీద విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వ రిమోట్ కంట్రోల్ బీజేపీ దగ్గర ఉందని రాహుల్ వ్యాఖ్యనించారు. ప్రధాని మోడీ చేతిలో ఏపీ ప్రభుత్వం కీలుబొమ్మలా మారిందని ఆరోపించారు. ఏ రాష్ట్రంలో లేనంతగా ఏపీని ప్రధాని మోడీ రిమోట్‌తో శాశిస్తున్నారని..చెప్పుకొచ్చారు. బీజేపీతో ఏపీ ప్రభుత్వనికి కమిట్‌మెంట్స్ ఉన్నాయని .. రాహుల్ గాంధీ తెలిపారు. విభజన అంశాలను లేవనెత్తటంతో ఏపీ ప్రభుత్వం విఫలం చెందిందని రాహుల ఆరోపించారు. బీజేపీ కంట్రోల్ లో ఉన్నందుకే జగన్ సర్కార్ ఈ అంశాలు లెవనెత్తడం లేదని విమర్శించారు. అయితే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన రాహుల్ గాంధీపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి.
దేశంలో కాంగ్రెస్ పార్టీ తెరమరుగైందని.. ఆ పార్టీకి భవిషత్తు లేదని.. ప్రాణం లేని పార్టీకి రాహుల్ గాంధీ జీవం పోయాలని చూస్తున్నారని వైసీపీ కార్యకర్తలు రాహుల్ గాంధీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. జగన్‌ను విమర్శించే స్థాయి రాహుల్‌కు లేదని వైసీపీ శ్రేణులు ఎద్దెవా చేస్తున్నాయి. జగన్‌తో పెట్టుకున్నప్పటి నుంచే కాంగ్రెస్ పతనం మొదలైందని వారు చెబుతున్నారు. వైఎస్ ఫ్యామిలీని రోడ్డున పడేయటం వల్లే మీరు ఈరోజున రోడ్ల మీదపడి తిరుగుతున్నారని వైసీపీ కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి 10 మంది అభ్యర్థులు పోటీ చేయడానికి ఉన్నారా అంటూ రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నారు. మొత్తనికి ఏపీకి వచ్చి తేనె తొట్టిని కదిలించినట్లుగా ఉంది రాహుల్ పరిస్థితి.