Thursday, April 25, 2024

జగన్ పేరు ఎత్తడానికి ధైర్యం సరిపోలేదా…?

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ ఈ పాదయాత్ర చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ 3500 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగుతుంది. తమిళనాడు, కేరళలలో ఈ పాదయాత్ర ఇప్పటికే ముగిసింది. ఆయన ఇప్పటికే 1000 కిలోమీటర్లను పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో ఏపీలో నాలుగు రోజుల పాటు రాహుల్ గాంధీ తన పాదయాత్రను కొనసాగించారు ముఖ్యంగా కర్నూల్ , అనంతపురం జిల్లాలను టచ్ చేస్తూ.. రాహుల్ గాంధీ పాదయాత్ర సాగింది. తాజాగా ఏపీలో రాహుల్ గాంధీ పాదయాత్ర ముగిసింది. మంత్రాలయం టెంపుల్ సర్కిల్ నుంచి ప్రారంభమయిన యాత్ర కర్ణాటకలోకి ప్రవేశించింది. కర్ణాటకలో రెండు రోజుల పాటు సాగనుంది. ఆంధ్రప్రదేశ్ లో రాహుల్ పాదయాత్ర నాలుగు రోజుల పాటు సాగింది. మొత్తం 100 కిలో మీటర్లకు పైగా రాహుల్ నడక సాగించారు. ఏపీలో రాహుల్ గాంధీ యాత్రకు పెద్దగా స్పందన లేదని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే..రాహుల్ గాంధీ ఏపీలో చేసిన యాత్రను ఓసారి గమనిస్తే.. ఆయన ఎక్కడ కూడా ఏపీ సీఎం జగన్ పేరు ఎత్తలేదని తెలుస్తుంది. జగన్ పేరు పలకడం ఇష్టం లేక అలా చేశారో.. లేక జగన్‌తో మనకు ఎందుకని అనుకున్నారో తెలియదు కాని ఏపీలో మాత్రం జగన్ ప్రస్తావన తీసుకురాలేదాయన. కాని జగన్ సర్కార్ మీద మాత్రం విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వ రిమోట్ కంట్రోల్ బీజేపీ దగ్గర ఉందని రాహుల్ వ్యాఖ్యనించారు. ప్రధాని మోడీ చేతిలో ఏపీ ప్రభుత్వం కీలుబొమ్మలా మారిందని ఆరోపించారు. ఏ రాష్ట్రంలో లేనంతగా ఏపీని ప్రధాని మోడీ రిమోట్‌తో శాశిస్తున్నారని..చెప్పుకొచ్చారు. బీజేపీతో ఏపీ ప్రభుత్వనికి కమిట్‌మెంట్స్ ఉన్నాయని .. రాహుల్ గాంధీ తెలిపారు. విభజన అంశాలను లేవనెత్తటంతో ఏపీ ప్రభుత్వం విఫలం చెందిందని రాహుల ఆరోపించారు. బీజేపీ కంట్రోల్ లో ఉన్నందుకే జగన్ సర్కార్ ఈ అంశాలు లెవనెత్తడం లేదని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే..రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ రాహుల్ గాంధీ ఇచ్చారు. ఇదే సమయంలో రాజధానిపై కూడా తమ స్టాండ్ ఏమిటో తెలియజేశారాయన. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని తమ అభిమతంగా రాహుల్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మీద సుతిమెత్తగా విమర్శలు చేయడాన్ని రాజకీయ విశ్లేషకులు అనేక రకాలుగా అభివర్ణిస్తున్నారు. భవిష్యత్తులో అధికారంలోకి రావలంటే జగన్‌తో ఏదైన అవసరం పడవచ్చనే భావనలో రాహుల్ గాంధీ ఉన్నారని.. అందుకే నేరుగా ఆయన జగన్ ప్రస్తావన తీసుకురాలేదని అంటున్నారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జగన్ సాయం కోరిన ఆశ్చర్యపడాల్సిన పనిలేదని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనప్పటికి కూడా ఏపీలో ఒక్కసారిగా కూడా రాహుల్ గాంధీ జగన్ పేరును ఎత్తకపోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!