ఎవరు చెప్పారు ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రమని, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ధనిక రాష్ట్రమనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఖర్చుపెట్టే ఖర్చులు చూస్తుంటే దిమ్మ తిరిగి పోవాల్సిందే. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నీరు – చెట్టు అని ఒక కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమంలో మట్టి తవ్వి తియ్డానికి 13 వేల 600 వందల కోట్ల రూపాయలు ఖర్చయినట్లు లెక్కలు చెబుతున్నారు. మట్టి తియ్యడానికి అసలు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందా అంటే పేద రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలి. ఇంకా ఈ మట్టిని తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రబుద్ధులు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.

మరో కుంభకోణంలో పాఠశాలకు సున్నం వేయడానికి మూడున్నర కోట్లు ఖర్చు చేయాల్సిన చోట 120 కోట్లు ఖర్చు చేసారని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేసారు. అసలు సున్నం వేయడానికి పాఠశాలలకు 120 కోట్ల రూపాయలా? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చాల పాఠశాలలకు సరైన వసతి సదుపాయాలు లేక పిల్లలు అల్లాడిపోతున్నారు. కానీ సున్నం వేయడానికి 120 కోట్ల రూపాయల ఖర్చు అయిందంటే మాములు విషయం కాదు. అందుకే ఎవరన్నారు ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రమని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చుపెట్టడంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతుంది, కానీ అది అభివృద్ధిలో కాదు, అవినీతిలో అని మనకు సోము వీర్రాజు చెప్పిన ఈ రెండు విషయాలలోనే తెలుస్తుంది.