Thursday, April 18, 2024

జగన్‌పై నోరు జారిన మేకతోటి సుచరిత.. చీటి చిరిగినట్లేనా..?

- Advertisement -

మాజీ మంత్రి మేకతోటి సుచరిత ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. మంత్రి పదవి పోయిన దగ్గర నుంచి కూడా మేకతోటి సుచరిత పార్టీకి అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో మేకతోటి సుచరిత వైసీపీని వీడుతున్నట్లే అని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై మేకతోటి సుచరిత కూడా ఎప్పుడు స్పందిచింది లేదు. కాని పుట్టిన రోజున జగన్‌కు శుభాకాంక్షలు తెలిపి..తాను ఇంకా వైసీపీలోనే ఉన్నానని సంకేతాలు ఇచ్చారు. తాజాగా మేకతోటి సుచరిత చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా అధికార వైసీపీ పార్టీలో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఇంతకీ మేకతోటి సుచరిత పార్టీ గురించి , జగన్ గురించి ఏం మాట్లాడారో తెలియాలంటే ఈ మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. వైసీపీ స్థాపించిన నాటి నుంచి జగన్ వెంట నడిచిన వారిలో మేకతోటి సుచరిత కూడా ఒకరు. జగన్ కష్టకాలంలో ఆయన వెంట నడిచిన వారిలో మేకతోటి సుచరిత కూడా ఒకరు. అటు జగన్ కూడా మేకతోటి సుచరితకు తగిన ప్రాధాన్యం ఇస్తు వచ్చారు. 2012లో జరిగిన ఉప ఎన్నికలలో విజయం సాధించిన ఆమె 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు.

మళ్లీ 2019 ఎన్నికల్లో ఓడిపోయిన చోటే విజయం సాధించారామె. జగన్ తొలి క్యాబినెట్‌లో హోమంత్రిగా కూడా పదవిని అప్పగించారు. అయితే ఆ బాధ్యలను ఆమె సక్రమంగా నిర్వహించినట్లు ఎక్కడ కూడా కనిపించ లేదు. రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేసిన సందర్భంలో ..వాటిని తిప్పి కొట్టడంలో మేకతోటి సుచరిత ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. జగన్ క్యాబినెట్ పున:వ్యవస్థీకరణలో మేకతోటి సుచరిత తన పదవిని కోల్పోయారు. మంత్రి పదవి పోవడంతో ఆమె జగన్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వెంటనే తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో పార్టీ మీద కూడా విమర్శలు చేశారు. మేకతోటి సుచరిత పార్టీ మీద వ్యాఖ్యలపై జగన్ కూడా సీరియస్ అయినట్లుగా వార్తలు కూడా వచ్చాయి. దీంతో వెంటనే జగన్‌తో భేటీ అయి సమస్యను పరిష్కరించుకున్నారామె. ఆ సమయంలోనే జగన్ ఆమెకు జిల్లా అధ్యక్షురాలుగా బాధ్యతలు అప్పగించారు. కాని ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంలో ఆమె ఫెయిల్ అయ్యారు.

ఇదే సమయంలో మేకతోటి సుచరిత భర్త దయాసాగర్‌ ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలని ప్రయత్నిస్తున్నారు. ఆయనకు టీడీపీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో సుచరిత భర్త దయాసాగర్‌ టీడీపీలోకి వెళ్తారనే ప్రచారం కూడా సాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూసిన తరువాత.. ఆయన మనస్సు టీడీపీ వైపు మళ్లినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంపీగా టీడీపీ నుంచి బరిలోకి దిగాలని చూస్తున్నారట. ఇప్పటికే మేకతోటి సుచరిత భర్త దయాసాగర్‌ టీడీపీ నాయకులతో టచ్‌లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలకు బలం చేకూరుస్తూ మేకతోటి సుచరిత కూడా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను బ్రతికి ఉన్నంత వరకు కూడా జగన్‌తోనే ఉండాలని కోరుకుంటున్నానని ..కాని తన భర్త ఎటు వెళ్తే తాను కూడా అటే వెళ్లాలి కదా అని ప్రశ్నించారు. భర్త ఒక పార్టీలో తాను ఒక పార్టీలో ఉంటే బాగోదు కదా అంటూ మీడియా ఎదుటగానే ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో మేకతోటి సుచరిత వైసీపీలో కొనసాగడం కష్టం అని అందరికి అర్థం అయింది. ఈక్రమంలో మేకతోటి సుచరిత రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అందరు అతృతగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!