Thursday, March 28, 2024

టీడీపీ అంతర్గత సర్వే.. ఏ జిల్లాలో ఎన్ని సీట్లంటే…అధికారానికి చాలా దూరంగా

- Advertisement -

2024లో జరిగే ఎన్నికలు అన్ని పార్టీలకన్నా కూడా టీడీపీకి ఎంతో కీలకం అని చెప్పాలి. ఎందుకంటే ఆ పార్టీ 2019లో జరిగిన ఎన్నికల్లో చాలా దారుణంగా ఓడిపోయింది. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 175
సీట్లగాను కేవలం 23 సీట్లకే పరిమితం అయింది. దీని తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీ దారుణ ఫలితాలనే చవి చూసింది. దీంతో వచ్చే ఎన్నికలు టీడీపీకి చావో రేవోగా మారాయి. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ఇవే తనకు చివరి ఎన్నికలని చెప్పడం కూడా టీడీపీకి పెద్ద సమస్యగా మారింది. ప్రజల్లో కూడా టీడీపీ మీద నమ్మకం కూడా కలగడం లేదు. అందుకే చంద్రబాబు ఎక్కువుగా ప్రజలను కాకుండా.. పవన్ కల్యాణ్ మీద ఆధారపడుతున్నారు. అందుకే చంద్రబాబు ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండటానికి కూడా సిద్దం అవుతున్నప్పటికి కూడా.. ప్రజల నుంచి టీడీపీకి పెద్దగా స్పందన రావడం లేదు. ఇదిలా ఉంటే టీడీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉందనే దానిపై ఎప్పటికప్పుడు వారి అనుకుల మీడియాతో పాటు, రాబిన్ శర్మ టీం కూడా సమీక్షలు , సర్వేలు నిర్వహిస్తుంది.

తాజాగా టీడీపీనే ఓ అంతర్గత సర్వే నిర్వహించినట్లుగా వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉందనే దానిపై టీడీపీ అధిష్టానం ఓ రహస్య నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఈ సర్వేలో టీడీపీ మ్యాజిక్ ఫిగర్‌కు చాలా దూరంలో నిలిచినట్లుగా వారి సర్వేలో తేలిందట. టీడీపీ కనుక ఒంటరిగా పోటీ చేస్తే 50 సీట్లలలో కూడా విజయం సాధించలేని పరిస్థితి నెలకొందట. దీనితో పాటు ఆ పార్టీకి 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సరైన అభ్యర్థులు కూడా లేరని తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే.. అధికార పీఠానికి చాలా దూరంలో నిలిచిపోనుందని సొంత సర్వేలోనే తేలడం సంచలనంగా మారింది. ఏ జిల్లాలో ఎన్ని సీట్లు వస్తాయో కూడా లెక్కలతో బయటకు వచ్చింది. మరి టీడీపీ ఏ జిల్లాలో ఎన్ని సీట్లు సాధిస్తుందో మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

శ్రీకాకుళంలో 10 సీట్లు ఉంటే టీడీపీ 3-4 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందట. విజయనగరంలో 9 సీట్లు ఉండగా, టీడీపీకి 3, విశాఖలో 15 సీట్లు ఉండగా టీడీపీ-6, తూర్పు గోదావరిలో 19 సీట్లు ఉండగా టీడీపీ-5, పశ్చిమ గోదావరిలో 15కి టీడీపీకి 5సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందట. కృష్ణాలో 16 సీట్లకు..టీడీపీకి 5.. గుంటూరులో 17 ఉండగా, టీడీపీకి 5 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందట. ప్రకాశంలో 12కి 4, నెల్లూరులో 10 సీట్లకు 2, కడపలో 10 సీట్లకు 1, చిత్తూరులో 14కు 4, కర్నూలులో 14కు..4, అనంతపురంలో 14 సీట్లకు 5 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తేలింది. అంటే మొత్తం మీద 50 నుంచి 55 సీట్లు మాత్రమే గెలుచుకునే ఛాన్స్ ఉందని సర్వేలో తేలిందట. అయితే జనసేనతో పొత్తు ఉంటే ఇంకా ఫలితాలు మారతాయని టీడీపీ అంచనా వేస్తుంది. టీడీపీ సొంత సర్వేనే ఇంత దారుణంగా ఉంటే..అసలు సర్వే ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి వచ్చే ఎన్నికల్లో అయిన టీడీపీ అధికారంలోకి వస్తుందో లేదో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!