వివాదస్పద సినీ విమర్శకుడు కత్తి మహేష్ ఈ మధ్యకాలంలో రాముడు పై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై కత్తి మహేష్ ను తెలంగాణ నుంచి ఆరు నెలలు బహిష్కరించారు. తరువాత కత్తి మహేష్ ను తెలంగాణాలో పోలీసులు చిత్తూరులో విడిచి పెట్టగా, అక్కడ నుంచి మరలా బెంగళూరు తరలించారు.

జూన్ 29 నాడు ఒక న్యూస్ ఛానల్ లో జరిగిన చర్చ కార్యక్రమంలో కత్తి మహేష్ సీతారాములపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని హిందూ వాహిని సంస్థ పోలీసులకు పిర్యాదు చేసారు. కానీ పోలీసులు కట్టి మహేష్ పై సరిగ్గా స్పందించకపోవడంతో హిందూ వాహిని అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ తెనాలి కోర్ట్ లో పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన కోర్ట్ తాజాగా వివిధ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసారు పాటిబండ్ల రామకృష్ణ తెలియచేయాడు.