నందమూరి తారకరత్నకు షాక్ తగిలింది. బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెం.12లో తారక రత్న నడుపుతున్న కబరా డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేసేందుకు ప్రయత్నించారు. దీంతో రెస్టారెంట్‌ నిర్వాహకులు జీహెచ్‌ఎంసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న తారకరత్న అక్కడికి వచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ రెస్టారెంట్ ఉందని అధికారులు తారక రత్నకు తెలియచేసారు.

రాత్రి పూట మద్యం అమ్ముతూ, సౌండ్ సిస్టమ్స్ పెడుతూ న్యూసెన్స్‌ క్రియేట్ చేస్తున్నారని స్థానిక సొసైటీ సభ్యులు కూడా జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేశారు. దీనితో కూల్చివేసేందుకు వచ్చామని అధికారులు తెలియజేసారు. అయితే ఈ విషయంలో తమకు కొంత సమయం ఇవ్వాలని తారకరత్న కోరారు.

Taraka ratna