Wednesday, April 24, 2024

కృష్ణాజిల్లా ఆ వైసీపీ ఎమ్మెల్యే టాప్..సర్వేలో ముందంజ

- Advertisement -

కృష్ణాజిల్లా ఈ పేరు వింటే మహ మహ నాయకులు గుర్తుకు వస్తారు. ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా, మంత్రులుగా పని చేసిన ఘనత ఖచ్చితంగా కృష్ణాజిల్లాకే చెందుతుంది. క‌‌ృష్ణాజిల్లా అంటే అందరికి ముఖ్యంగా గుర్తుకు వచ్చేది కమ్మ ప్రభాల్యం. ఈ జిల్లాలో కమ్మ కులానికి చెందిన వారు ఎక్కువుగా ఉంటారు. ఆస్తులు కూడా ఎక్కువుగా ఉండటంలో జిల్లాలో వారిదే అధిపత్యం కొనసాగుతు వచ్చేది. కాని కాపులు, రెడ్లు కూడాఎప్పటికప్పుడు తన ప్రభావాన్ని చూపిస్తు వస్తున్నారు. ఏపీలో ఎక్కడ ఏ పార్టీ గెలిచినప్పటికి కూడా జిల్లాలో మాత్రం కమ్మ కులానికి చెందిన వారే ఎక్కువుగా గెలుస్తు ఉండేవారు.

ఈ కులం మొదటి నుంచి టీడీపీకి అండగా నిలిచేవారు. కాపులు , రెడ్లు ఒక్కప్పుడు కాంగ్రెస్‌కు, ఇప్పుడు వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో జిల్లాను పూర్తిగా మార్చేశారు జగన్. ఈ ఎన్నికల్లో 16 నియోజిక వర్గాలకుగాను 14 నియోజిక వర్గాలు గెలుచుకుని తమ పార్టీ సత్తా నిరుపించారు వైసీపీ నాయకులు. కేవలం గన్నవరం, విజయవాడ ఈస్ట్ నియోజిక వర్గాల్లో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. తరువాత జరిగిన రాజకీయ పరిణామాల వల్ల గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జగన్‌కు మద్దతుగా నిలిచారు. ఇక మిగిలిన విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్ కూడా వైసీపీలో చేరుతున్నారని అనేక వార్తలు వినిపించినప్పటికీ , ఆయన ప్రస్తుతం టీడీపీలోనే కొనసాగుతున్నారు.

ఇక వైసీపీ సర్కార్ అధికారంలోకి మూడేళ్లు పూర్తి అయింది. ఈ మూడేళ్లలో జిల్లాలో చాలానే పరిణమాలు చోటు చేసుకున్నాయి. కృష్ణాజిల్లాను రెండు జిల్లాలుగా మార్చడం జరిగింది. అందులో కృష్ణాజిల్లా ఒకటి కాగ, రెండోది ఎన్టీఆర్ జిల్లా. పార్లమెంట్ స్థానాలు ఆధారంగా ఉమ్మడి జిల్లాను విభజించడం జరిగింది. జిల్లాకు ఎన్టీఆర్ పెట్టడంతో.. టీడీపీ శ్రేణులు కూడా జగన్‌పై హర్షం వ్యక్తం చేశాయి. ఇదే సమయంలో హెల్త్ యూనివర్సిటికి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం పెను సంచలనం సృష్టించింది. ఇదిలా ఉంటే ఉమ్మడి కృష్ణాజిల్లా పనితీరు వచ్చే సరికి కొంతమందిపై వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అనే దాని గురించి జిల్లా ప్రజలు అనేక రకాలుగా చర్చించుకుంటున్నారు.

జిల్లాలో కొంతమంది వైసీపీ ఎమ్మెల్యే పనితీరుపై ప్రజలు అసంత‌ృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాయకులు అందరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే జిల్లాలో ఎవరు ఊహించని విధాంగా అందరికంటే ముందు నిలిచారు మైలవరం ఎమ్మెల్యే వసంత క‌ృష్ట ప్రసాద్. మాజీ మంత్రి దేవినేని ఉమ వంటి నాయకుడిపై 12000 ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారాయన. వసంత క‌ృష్ట ప్రసాద్ ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి నియోజిక వర్గంలోనే ఉంటున్నారు. తన వ్యాపారాలను సైతం పక్కన పెట్టి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తున్నారు. గత ప్రభుత్వం హాయంలో చోటు చేసుకున్న ఇసుక, మట్టి వంటి దందాలను అరికట్టడంలోఆయన విజయం సాధించారు. తప్పు చేసి ఇరుక్కుంటే తన సొంతవారికి సైతం రికమండేషన్ చేయని తత్వం ఆయనది.

తన నియోజిక వర్గంలో ప్రతి గ్రామానికి నెలలో ఒక్కసారైన పర్యటిస్తూ , ప్రజల సమస్యలు తీర్చడంలో ఆయన ముందున్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో కూడా వసంతకు మంచి స్పందన లభిస్తోంది. ఈవిధంగా నిత్యం ప్రజల్లో తిరుగుతూ జిల్లాలో పట్టుపెంచుకునే పనిలో పడ్డారు వసంత. ఆయన ఇలాగే ప్రజలకు సేవ చేస్తే వచ్చే ఎన్నికల నాటికి దేవినేని ఉమ మరో నియోజిక వర్గం వెత్తుక్కోవాల్సిందే అని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఈ విధాంగా జిల్లాలో హేమా హేమిలు ఉన్నప్పటికీ కూడా అందరి కంటే ముందు వరుసలో నిలిచారు వసంత కృష్ణ ప్రసాద్.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!