Wednesday, October 16, 2024

చెప్పాముగా కడిగిన ముత్యంలా వస్తాడని..జగన్ అక్రమాస్తుల కేసును కొట్టివేసిన కోర్టు

- Advertisement -

ఏపీ సీఎం,వైసీపీ అధినేత జగన్‌కు శుభవార్త అందించింది హైకోర్టు. జగన్ అక్రమాస్తుల కేసును కొట్టివేస్తు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియా సిమెంట్స్ కేసులో ఎటువంటి క్విడ్ ప్రో కో జరగలేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. సీబీఐ దాఖలు చేసిన పటిషన్‌లో ఎటువంటి సాక్ష్యాలను చూపించలేకపోవడంతో .. ఇండియా సిమెంట్స్‌కు దీనిలో ఎటువంటి సంబంధం లేదని ఈ కేసును కొట్టివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే…వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన వ్యాపార సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెట్టించుకున్నారని.. జగన్‌పై ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్ నుంచి బయటకు రావడంతో…జగన్‌పై అక్రమాస్తుల కేసులను బనాయించిన సంగతి అందరికి తెలిసిందే. దీనిపై ఆయన 16 నెలలు జైలు జీవితం కూడా గడిపారు.

అయితే ఈ కేసుల్లో బలం లేదని చాలామంది నిపుణులు తెలపడం జరిగింది. లక్ష కోట్లు అనేది అంత ప్రచారమే అని… 1300 కోట్లకు సంబంధించిన దానిపైనే కేసులు నడుస్తున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి గతంలోనే చెప్పడం జరిగింది. అయితే దీనిపై కూడా ఒక్కొక్క కేసును విచారిస్తున్న హైకోర్టు..తమ తీర్పును వెల్లడిస్తుంది. జగన్ అక్రమాస్తుల కేసులో మరొక కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేస్తు నిర్ఱయం తీసుకుంది. జగన్‌పై పెట్టిన అక్రమ కేసుల్లో మొత్తం 1180 కోట్లు ఛార్జ్ షీట్‌లుగా ఆరోపించింది. అయితే ఇండియా సిమెంట్స్‌పై నమోదు చేసిన కేసులో ఎటువంటి సాక్ష్యాలు లేకపోకపోవడంతో.. ఈ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఇండియా సిమెంట్స్ కేసులో ఎటువంటి క్విడ్ ప్రో కో జరగలేదని కోర్టు తీర్పు ఇచ్చింది.ఇక ఇప్పుటికే వాన్ పిక్ కంపెనీకి జగనే కేసుకు సంబంధం లేదని తెలంగాణ హైకోర్టు వాన్ పిక్ సంస్థను ఆ కేసు నుంచి తొలగించిన సంగతి అందరికి తెలిసిందే. వాన్ పిక్ సంస్థ 854 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ఎక్కడ కూడా సీబీఐ నిరుపించలేకపోయింది. దీంతో వాన్ పిక్ సంస్థకు క్లీన్ చీట్ ఇస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

ఇప్పుడు ఇండియా సిమెంట్స్ కేసులో ఎటువంటి క్విడ్ ప్రో కో జరగలేదని కోర్టు తేలపడంతో.. సీబీఐ కోర్టుకు షాక్ తగిలినట్లు అయింది. జగన్‌పై పెట్టిన అక్రమ కేసుల్లో మొత్తం 1180 కోట్లు అవినీతి జరిగిందని సీబీఐ కోర్టు ఆరోపించింది. ఇందులో ఇప్పటికే వాన్ పిక్ సంస్థ 854 కోట్లు కేసును కొట్టివేసింది హైకోర్టు. ఈ రోజు ఇండియా సిమెంట్స్ కి చెందిన ఛార్జ్ షీట్ 140 కోట్ల పెట్టుబడిలో కూడా ఎటువంటి క్విడ్ ప్రో కో జరగలేదని కోర్టు తెలిపింది. అంటే మొత్త 983 కోట్ల కి అవినీతి జరగలేదు అని కోర్టు కొట్టేసింది.. ఇంకా సుమారు 190 కోట్లకి సంబందించిన ఛార్జ్ షీటలు ఉన్నాయి. వీటిల్లో కూడా జగన్‌కు క్లీన్ చీట్ వస్తుందని జగన్ అభిమానులు ఆశిస్తున్నారు. మేము ఎప్పుడో చెప్పాము…. మా అన్న కడిగిన ముత్యం లా బయటకి వస్తాడు అని జగన్ అభిమానులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న కేసుల నుంచి కూడా మా అన్న కడిగిన ముత్యం లా బయటకి వస్తాడు అని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. మరి దీనిపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!