కూర్చీలతో మరి కొట్టుకున్న తెలుగు తమ్ముళ్లు.. ఎక్కడో తెలుసా..?
టీడీపీ అడ్డాలో కొట్టుకున్న తెలుగు తమ్ముళ్లు.. ఎందుకో తెలుసా..?
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి చివరిసారిగా ముఖ్యమంత్రి కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు కలలు కంటుంటే… ఆ పార్టీ నాయకులు ,కార్యకర్తలు ఇదేమి పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం టీడీపీకి ప్రతికూలంగా మారింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఆ ఎన్నికల్లో టీడీపీ కేవలం 175 సీట్లలలో కేవలం 23 సీట్లలలో మాత్రమే విజయం సాధించింది. తరువాత జరిగిన స్థానికి సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీ దారుణ ఫలితాలను చవి చూసింది. అయితే పార్టీని గాడిని పెట్టి 2024 ఎన్నికల్లో అయిన సత్తా చాటాలని చంద్రబాబు ప్రయత్నిస్తుంటే… నాయకులు మాత్రం నిత్యం గొడవలతో పార్టీ అధినేతకు కొత్త తలపోటును తీసుకువస్తున్నారు.ఇటీవలే కృష్ణాజిల్లా జగ్గయపేట నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తున్న సమయంలోనే నాయకుల మధ్య అధిపత్య పోరు బయటపడింది.
రఘురాం వర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ వర్గం బాహాబాహీకి దిగింది. ఇరు వర్గాలు రోడ్డున పడి కొట్టేసుకున్నాయి. కర్రలు రాళ్లతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒకరుపై మరోకరు కేసులు కూడా పెట్టుకుని పార్టీ పరువును రోడ్డున పడేలా చేశారు. ఈ ఘటన మరువక ముందే మరోమారు టీడీపీ శ్రేణులు బాహాబాహీకి దిగడం సంచలనంగా మారింది. అది కూడా టీడీపీ బలంగా ఉన్న అనంతపురం జిల్లాలో కావడంతో ఇది మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..అనంతపురం జిల్లాలో తెలుగు తమ్ముళ్లు కూర్చీలతో కొట్టుకోవడం సంచలనంగా మారింది. అది కూడా నాయకుల మధ్య కావడం విశేషం.
తమ నేత గొప్ప అంటే తమ నేత గొప్ప అంటూ తెలుగు తమ్ముళ్లు పార్టీ సమావేశాన్ని రసభసగా మార్చేశారు. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి, ప్రస్తుత టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఇరువర్గాలవారు కుర్చీలతో ఒకరిపై మరొకరు దాడిచేసుకున్నారు. పలువురు నేతలు సర్దిచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ఎవరిని లెక్క చేయకుండా గొడవకు దిగారు. కల్యాణ దుర్గం టికెట్ కోసం ఈ ఇద్దరునేతలు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి హనుమంతరాయచౌదరి భంగపడ్డారు. అధిష్టానం ఉమామహేశ్వర్ నాయుడికి టికెట్ ఇవ్వడం జరిగింది. కాని ఉష శ్రీ చరణ్ చేతిలో ఉమామహేశ్వర్ నాయుడు ఓడిపోవడం జరిగింది. ఆ ఎన్నికల్లో తాము ఓటమిపాలవడానికి హనుమంతరాయచౌదరి కూడా ప్రధాన కారణమనేది ఉమా వర్గీయుల వాదన.
అప్పటి నుంచి కూడా ఈ రెండు వర్గాల మధ్య నిత్య గొడవలు జరుగుతునే ఉన్నాయి. నియోజకవర్గంలో టీడీపీ సమావేశం పెట్టుకున్న ప్రతిసారి కూడా ఇరువర్గాలవారు బాహాబాహీకి దిగడం సర్వసాధారణమైపోయింది. దీనిపై టీడీపీ అధినేత కలుగజేసుకుని వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికో ముందుగానే ప్రకటించాలని ఇక్కడి పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. లేదంటే పరిస్థితి రానున్న రోజుల్లో మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని టీడీపీ కార్యకర్తలు వాపోతున్నారు. మరోవైపు టీడీపీలో జరుగుతున్న పరిణామాలన్ని కూడా తమకు కలిసి వస్తాయని వైసీపీ శ్రేణులు లెక్కలు వేసుకుంటున్నాయి. మరి కల్యాణ దుర్గం నియోజకవర్గంలో టీడీపీ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.