Tuesday, September 10, 2024

2024 ఎన్నికల్లో టీడీపీ పక్కా ఓడిపోయే స్థానాలు ఇవే ?

- Advertisement -

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా చేసుకొని తమతమ ప్రణాళికలను రచిస్తోన్న సంగతి తెలిసిందే… ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యాయి… ఏ నాయకుడుకైతే ప్రజాధరణ ఎక్కువగా ఉంటుందో వారిని ఫైనల్ చేసే పనిలో నిమగ్నం అయ్యారు….

తాజాగా ఎన్నికల దృష్ట్యా ఓ మీడియా సంస్థ సర్వే నిర్వహించిందట. అందులో మొదటగా కొన్ని నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. ఆ నియోజకవర్గంలో టీడీపీ పక్క ఓటమిచెందే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే తెలిపిందట. అందుకు కారణం ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలమధ్య వర్గపోరే కారణం అని తెలిపింది… ముఖ్యంగా ఎమ్మిగనూరు, బద్వేలు, రైల్వే కోడూరు, కావలి, మైలవరం, ధర్మవరం, మైదుకూరు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ సర్వేలో తేలిందట.. వీలైనంత త్వరగా చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గాలపై దృష్టి పెడితే బాగుంటుందని ఈ సర్వేలో తేలిందట..

మరోవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజకవర్గాల వారీగా ప్రతిరోజు గడపగడపకు వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వారి సమస్యలను పరిష్కారం చేస్తున్నారు.. గెలుపే లక్ష్యంగా చేసుకొని ప్రతిరోజు వైసిపి ఎమ్మెల్యేలు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు…

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!