తిరుమలలో వెయ్యికాళ్ల మండపంపై ఎప్పటి నుంచో వివాదం కొనసాగుతూనే ఉంది. పడగొట్టిన చోటే వెయ్యికాళ్ల మండపాన్ని మరలా పునర్నిర్మించాలని ఎప్పటి నుంచి చాల మంది భక్తులు కోరుతున్నా దానిపై టిటిడితో పాటు, ప్రభుత్వ స్పందన కూడా కరువైంది. ఈరోజు తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న తరువాత వైసిపి ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి రాగానే తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదుట వెయ్యికాళ్ల మండపాన్ని నిర్మిస్తామని తెలియచేసారు. తిరుమలలో వెయ్యి కాళ్ళ మండపాన్ని నిర్మించాలని ఎప్పటి నుంచో టిటిడి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని, వెయ్యి కాళ్ళ మండపాన్ని తిరుమలలో నిర్మించాలని ఇప్పటికే పీల్ దాఖలు చేశామని రోజా తెలియచేసారు., వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత తప్పకుండా వెయ్యి కాళ్ళ మండపాన్ని నిర్మిస్తామని తెలియచేసారు.