తాగరా… తాగి ఊగరా… అన్నాడు ఒక పెద్ద మనిషి, ఇక తెలంగాణాలో సర్కార్ పరిస్థితి కూడా అలానే ఉంది ఇప్పుడు. ఇప్పటి వరకు శుక్రు, శని, ఆదివారాలలో మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఉన్న పర్మిషన్ ఇప్పుడు ఇంకొక గంట సేపు పెంచి రాత్రి ఒంటి గంట వరకు మందు బాబులు చిందులు తోక్కమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ పరిధితో పాటు, చుట్టు పక్కల ఒక ఐదు కిలోమీట్లర్ల వరకు తెరుచుకోవచ్చని ప్రభుత్వం జారీ చేసింది.

జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 400 వందల వరకు పబ్బులు ఉన్నాయి. రోజుకి హైదరాబాద్ నగరంలో లక్ష లీటర్ల మందుతో పాటు, ఐదు లక్షల లీటర్ల బీర్లు విక్రయమవుతున్నాయి. ఇక నుంచి అదనంగా పెంచిన సమయంతో ఇంకాస్త ఎక్కువ తాగిచ్చి జేబులు నింపుకోవడానికి ఎక్స్చేంజి శాఖ సన్నద్ధమవుతోంది.