Tuesday, September 10, 2024

వైసీపీలో తిరుగుబాటు..ఆ ఎమ్మెల్యేలపై జగన్ వేటు ..?

- Advertisement -

వైసీపీలో అసమ్మతి ఎక్కువ అవుతుందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. పార్టీ అధికారంలోకి వచ్చి మూడున్నర ఏళ్లు అయింది. ఇప్పటి వరకు రఘురామ ఎపిసోడ్ మినయిస్తే.. మిగిలిందంత కూడా బాగానే సాగింది. పార్టీలో ఎక్కడ కూడా నాయకులు కాని ఎమ్మెల్యేలు కాని గీత దాటింది లేదు. కాని ఎన్నికలు దగ్గర పడే కొద్ది అధికార పార్టీలో లుకలుకలు ఒక్కొక్కటికి బయటకు వస్తున్నాయి. మంత్రివర్గ పున:వ్యవస్థీకరణ జరిగిన సమయంలోనే కొందరు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు. మంత్రి పదవి రాకపోవడంతోనే ఇలా వ్యవహరించి ఉంటారని చాలామంది ఆ వ్యాఖ్యలను లైట్ తీసుకున్నారు. కాని తాజాగా కొందరు నేతలు పార్టీ గీత దాటి మరి మాట్లాడుతున్నారు. అలాంటి వారిలో ముఖ్యులు ఆనం రాంనారయణ రెడ్డి. ఆనం ఫ్యామిలీకి మంచి పట్టుంది. అయితే ఇది అంతా కూడా గతమనే చెప్పాలి. ప్రస్తుతం నెల్లురులో కొత్త నాయకుల హవా ఎక్కువుగా కనిపిస్తోంది.

ఆనం రాంనారయణ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. దివంగత రాజశేఖరరెడ్డి హయంలో ఆనం రాంనారయణ రెడ్డి మంత్రిగా కూడా పని చేశారు. రాజశేఖరరెడ్డి మరణంతో ఆనం ఫ్యామిలీ పతనం కూడా మొదలైందని అంటుంటారు. వైఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఓ వెలుగు వెలిగిన ఆనంకు , జగన్ ప్రభుత్వంలో మాత్రం సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. తాజాగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తమ ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరుగుతున్నాయని చెప్పి వాటిని ఎత్తిచూపించే ప్రయత్నం చేశారాయన. తాజాగా కూడా ఏం చేశామని ఓట్లు అడగాలని, పెన్షన్లు ఇస్తే ఓట్లు వేయరని అన్నారు. రోడ్లపై గుంతలు పూడ్చలేదు..కొత్త ప్రాజెక్టులు కట్టలేదు..ఇళ్ళు కట్టించి ఇవ్వలేదు..ఇంకా ఓట్లు ఎలా అడగాలని అంటున్నారు.

అటు మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం పెన్షన్ల కోతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పెన్షన్లు కొత్త కొస్తే గడపగడపకు ఎలా వెళ్తామని నిలదీశారు. ఆ మధ్య ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్..జగన్ బటన్ నొక్కి డబ్బులు ఇస్తున్నారు..వాలంటీర్లు అన్నీ చూసుకుంటున్నారు..ఇంకా తమ గ్రాఫ్ ఎలా పెరుగుతుందని అడిగారు. ఇలా సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు ఎగరవేస్తున్న నేపథ్యంలో..జగన్ వేటు వేస్తారా అనే సందేహం అందరిలోను నెలకొంది. పార్టీ గీత దాటితే జగన్ సహించరని.. ఆయన చంద్రబాబు మాదిరిలా ఎవ్వరిని నెత్తిన పెట్టుకోరని పార్టీలోని కీలక నేత ఒకరు వ్యాఖ్యనించారు. వచ్చే ఎన్నికల్లో దాదాపు 30 నుంచి 40 మంది కొత్త మొహాలను చూసే అవకాశం ఉందని.. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన నేతలందరికి జగన్ చెక్ పెడతారని పార్టీ వర్గాలు అంటున్నయి. దీనిని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ఎవరికి సీట్లు దక్కుతాయో చూడాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!