ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మరొసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ ప్రణళికలు రచిస్తుంటే…వచ్చే ఎన్నికల్లో అయిన గెలిచి అధికారం చేజిక్కుచ్చుకోవాలని టీడీపీ , జనసేన పార్టీలు భావిస్తున్నాయి. 2024లో జరిగే ఎన్నికల్లో టీడీపీ , జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 2019 ఎన్నికల నాటి పరిస్థుతులు ఇప్పుడు వైసీపీకి కూడా కనిపించడం లేదు. మరొసారి అధికారంలోకి రావాలంటే వైసీపీ చాలానే కష్టపడాల్సి ఉంటుంది. తాజాగా సీబీఐ మాజీ జేడీ ఆఫీసర్ అయిన లక్ష్మీనారాయణ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైసీపీకి కొండంత అండలా కనిపిస్తోంది. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తుండగా..ఒక్క జేడీ లక్ష్మీనారాయణ మాత్రమే సమర్థించారు.
ఇంతకీ జగన్ తీసుకున్న ఏ నిర్ణయాన్ని లక్ష్మీనారాయణ సమర్దించారో తెలియాలంటే ఈ మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. ఇటీవల చంద్రబాబు సభలకు వచ్చి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంగతి మీ అందరికి తెలిసిందే. అయితే రోడ్ల మధ్య , ఇరుకు సందుల్లో సమావేశాలు పెట్టుకోవడానికి వీల్లేదని జగన్ సర్కార్ జీవో నెంబర్ 1ను తెర మీదకు తీసుకువచ్చింది. తమను టార్గెట్ చేస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవోగా చంద్రబాబు..పవన్ ఆరోపించారు. అయితే తాజాగా ఈ జీవో నెంబర్ 1పై జేడీ లక్ష్మీనారాయణ తనదైనశైలిలో స్పందించారు. ఈ జీవో ద్వారా సామాన్యులకు ఇబ్బంది లేకుండా పోలీసులు పరిశీలించి అనుమతులు ఇస్తారని మాజీ జేడీ వివరించారు. ప్రతీ విషయాన్ని పార్టీలు రాజకీయం చేయాలనుకుంటే ఏమీ చెప్పలేమని వ్యాఖ్యానించారు.
హైకోర్టు ఈ జోవోను కొట్టివేయలేదని..తాత్కాలికంగా సస్పెండ్ మాత్రమే చేసిందని మాజీ జేడీ వివరించారు. ఇదే సమయంలో జగన్ సర్కార్ మీద ప్రసంశలు కూడా కురిపించారు.పలాసలో ప్రభుత్వం నిర్మిస్తున్న కిడ్నీ రీసెర్చ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన … కిడ్నీ రోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోందని అభినందించారు. జగన్ సీఎం అయిన వెంటనే ఈ ఆస్పత్రి నిర్మించటం గొప్ప విషయంగా పేర్కొన్నారు. ఉద్దానంలో ఇంటింటికీ మంచి నీరు అందించేందుకు రూ 700 కోట్లతో ప్రాజెక్టు నిర్మించటం గొప్ప పనిగా మాజీ జేడీ పేర్కొన్నారు. ఈ సమయంలో జిల్లా మంత్రి అయిన మంత్రి సిదిరి అప్పలరాజుకు ఫోన్ చేసి అభినందించారు. ఉద్దానంలో మంచి నీరు అందించేందుకు తీసుకుంటున్న చర్యల పైన అభినందించారు.