Tuesday, September 10, 2024

బాలయ్యకు షాకిచ్చిన చంద్రబాబు.. రెండో అల్లుడు కథ క్లోజ్..అంత రాష్ట్ర భవిష్యత్తు కోసమే

- Advertisement -

తనకు అడ్డం వస్తే.. తన మన చూడటం టీడీపీ అధినేత చంద్రబాబుకు మొదటి నుంచి అలవాటు లేదు. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు వేరు వారు ఓ లెక్కనా..?. మరోసారి టీడీపీలో సరిగ్గా ఇదే జరుగుతున్నట్లు కనిపిస్తుంది. తన కొడుకు నారా లోకేష్ రాజకీయ జీవితానికి ఎక్కడ అడ్డం వస్తాడో అని హీరో ఎన్టీఆర్‌ను టీడీపీ నుంచి దూరం చేసిన వైనం మనం అందరం చూసే ఉంటాం. ఎన్టీఆర్ టీడీపీలో ఉంటే నారా లోకేష్ ఎప్పటికి కూడా నాయకుడుగా ఎదగలేడని భావించిన చంద్రబాబు.. నెమ్మదిగా ఎన్టీఆర్‌ను పార్టీకి దూరం చేశారు. ఇప్పుడు బాలకృష్ణ రెండో అల్లుడు వంతు వచ్చినట్లుగా ఉంది. బాలకృష్ణకు మొదటి అల్లుడు నారా లోకేష్ కాగ, రెండో అల్లుడు శ్రీభరత్.

ఇద్దరు కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ విశేషం ఏమిటంటే వైసీపీ అధినేత జగన్ కొట్టిన దెబ్బకు అటు నారా లోకేష్, ఇటు శ్రీభరత్ ఇద్దరు కూడా ఘోరంగా ఓడిపోయారు.నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోగా, శ్రీభరత్ విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నారా లోకేష్ టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో శ్రీభరత్ కూడా టీడీపీలో యాక్టివ్ కావాలని చూస్తున్నప్పటికి కూడా ఆయన ప్రయత్నం ఫలిచడం లేదు. బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్‌ను టీడీపీలో దూరం పెడుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ కారణంగానే శ్రీభరత్ అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఆయన పార్టీ కార్యక్రమాలను సైతం పట్టించుకోవడం లేదట. నారా భువనేశ్వరి ఎపిసోడ్‌లో కాని హెల్త్ యూనివర్సిటికి ఎన్టీఆర్ మార్చిన సమయంలో కాని శ్రీభరత్ బయటకు వచ్చి పెద్దగా స్పందించింది లేదు.

దీంతో అసలు ఆయన పార్టీలో ఉన్నారా? లేదా? అన్నది కూడా అనుమానంగానే నెలకొంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాకపోయిన పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పని లేదని టీడీపీ శ్రేణులే చెప్పడం విశేషం. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా టీడీపీలో తనను రాజకీయంగా ఎదగనివ్వరన్న ఆలోచనలోశ్రీభరత్ ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకోసమే ఆయన వ్యాపారాలకే పరిమితమయ్యారని వారు చెబుతున్నారు. ఈ కారణంగానే శ్రీభరత్ టీడీపీ అధినాయకత్వం మీద అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. శ్రీభరత్ టీడీపీకి దూరం అయితే క్యాడర్ కు ఎలాంటి సంకేతాలు వెళతాయని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. మరి బాలకృష్ణ రెండో అల్లుడు రాజకీయ జీవితం ఎలాంటి ట్విస్ట్‌లతో ముందుకు వెళ్తుందో చూడాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!