Friday, July 19, 2024

బాలయ్య నోటి దూల అక్కడ వరకు తెచ్చిందే.. దెబ్బకు క్షమాపణలు

- Advertisement -

టీడీపీ ఎమ్మెల్యే , టాలీవుడ్ హీరో బాలయ్యకు కాస్తా నోటి దూల ఎక్కువే అన్న సంగతి అందరికి తెలిసిందే. మా బ్లడ్ వేరు … మా బ్రీడ్ వేరు గతంలో బాలయ్య చెప్పారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ సభలకు వచ్చే జనాలను అలగా జనాలు అని కామెంట్స్ చేసినా… అమ్మాయి కనిపిస్తే..కడుపు అయిన చేయాలి.. లేకపోతే ముద్దు అయిన పెట్టాలని చెప్పిన బాలయ్యకే చెందింది. అయితే అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి బాలయ్య ఏం చేసిన కూడా చెల్లుబాటు అయింది. కాని ఇప్పుడు పరిస్థులు పూర్తిగా మారాయి. తాజాగా బాలయ్య ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఓ కులానికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసి.. తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు.

ప్రస్తుతం బాలయ్య తన కుటుంబంతో చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో సందడి చేస్తోంది. తన బావ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సొంత ఊరిలో సంక్రాంతి పండగను సంబరాల్లో పాల్గొన్నారు బాలయ్య. దేవ బ్రాహ్మణ సామాజిక వర్గంపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి క్షమాపణలు చెప్పారు. రావణబ్రహ్మను దేవ బ్రాహ్మణులకు మూల పురుషుడిగా అభివర్ణించారాయన. దీనిపై ఆ సామాజిక వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేవ బ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అంటూ తనకు అందిన సమాచారం తప్పు అని పేర్కొన్నారు. ఆ సమాచారం మేరకే తాను ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని వివరించారు.

దేవబ్రాహ్మణ పెద్దలందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని బాలయ్య తెలిపారు. తాను చెప్పిన మాటల వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి చాలా బాధపడ్డానని నందమూరి బాలయ్య అన్నారు. బాలయ్య ఇలా నోరు జారడం మొదటసారి కానప్పటికి కూడా క్షమాపణలు చెప్పడం మాత్రం ఇదే మొదటిసారి అని చాలామంది చెబుతున్నారు. మరి బాలయ్య నోటి దూల ఇప్పటికైనా తగ్గుతుందో లేదో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!