Sunday, October 13, 2024

YS Jagan: జగన్ తిరుపతి రాకుండా అడ్డుకు౦దామని ప్రయత్నించిన కూటమి ప్రభుత్వానికి బిగ్ షాక్..?!

- Advertisement -

YS Jagan: గత ఐదేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వైసీపీ ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. అప్పులు చేస్తున్నారని, పోర్టులను రాసిచ్చారని, పోలవరం పోయిందని, 33 వేల మంది అమ్మాయిలు మాయం అయిపోయారని, ఇలా తెలుగుదేశం, జనసేనలు తోచిన ఆరోపణలు చేసేవి. అలాంటి బురదను కడుక్కోవడమే సరిపోయింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి. కట్ చేస్తే తెలుగుదేశం కోరుకున్న అధికారం దక్కింది. అయితే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బురద జల్లుడు వ్యవహారాలనే నమ్ముకుంటూ ఉంది. శ్రీవారి లడ్డు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఆరోపణలకే పరిమితం అవుతూ ఉంది. ముందుగా చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత తెలుగుదేశం కీలక నేత పయ్యావుల కేశవ్ కూడా అదే చెబుతున్నారు. లడ్డూ ప్రసాదం అపవిత్రం అయ్యిందనేది వాస్తవం అంటూ పయ్యావులు వ్యాఖ్యానించాడు. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ తన వాదనకే పరిమితం అవుతూ ఉంది.

ఒక విషయాన్ని పదే పదే చెబుతూ ఉంటే, రుజువు చేయాల్సిన అవసరం లేకుండా అదే నిజం అని ఒక వర్గం నమ్ముతుందనేది తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న సిద్ధాంతం. లక్ష కోట్ల అవినీతి, అప్పులు మరియు ఇలాంటి విషయాల్లో తెలుగుదేశం పార్టీ అదే సిద్ధాంతాన్ని నమ్ముకుంది! అయితే తెలుగుదేశం పార్టీ మాటల తీవ్రతకు శ్రీవారి ప్రసాదం కూడా మినహాయింపు కాదని తేలిపోయింది. అది కూడా కోట్ల మంది హిందువులు అతి పవిత్రంగా భావించే ప్రసాదం విషయంలోనే తెలుగుదేశం పార్టీ పదే పదే ఆరోపణలు చేస్తూ ఉంది. నిరూపణ కాకపోయినా కూడా లక్ష కోట్ల ఆరోపణలు చేసి లాభపడినట్టు, తమ రాజకీయ స్వార్థానికి తెలుగుదేశం పార్టీ శ్రీవారి ప్రసాదాన్ని మరో ఆలోచనే లేకుండా వాడుకుంటూ ఉంది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అధికారం తమ చేతులలోనే ఉంది. నిజంగా జరిగింది ఏమిటో తేల్చడానికి తెలుగుదేశం పార్టీ పూనుకోవాలి. సీబీఐ విచారణకు, శాస్త్రీయమైన విచారణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అధికారంలో ఉన్న వారు అడ్డగోలు ఆరోపణలు చేసేస్తే సరిపోదు. అధికారం తమ చేతులలోనే ఉంది కాబట్టి నిరూపణ చేయాలి. దోషులు ఎవరో ప్రజలకి తెలియజేయాలి.

అపవిత్రం అయిపోయిందని టీడీపీ నేతలు తీర్పులు ఇస్తున్నారు. అయితే మీరు ఎన్ని చెప్పినా ఆ ఆరోపణలను రుజువు చేయకపోతే అందులో విష వ్యూహం ఉందని అనుకోవాలి తప్ప మరోటి లేదనే అనుకోవాలని వైసీపీ నాయకులు అంటున్నారు. ఆరోపణలు చేసేస్తే చాలు తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేరతాయని టీడీపీ నేతలు అతి తెలివితో వ్యవహారిస్తున్నట్టుగా ఉన్నారు. లక్ష కోట్ల ఆరోపణల తరహాలో తేరగా దొరికింది కదా అని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రీవారి ప్రసాదాన్నే చిత్తానికి వాడేస్తూ ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు జగన్ ని తిరుమల రాకుండా అడ్డుకోవాలని కూడా కూటమి ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తుందని వారు ఆరోపించారు. త్వరలోనే ప్రజలు కూటమి ప్రభుత్వం అసలు స్వరూపం తెలుసుకుంటారని ఆ రోజు ఎంతో దూరంలో లేదని వారు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇది వరకే మోడీ దగ్గరుండి మరీ జగన్ ని తీసుకెళ్లారని ఇప్పుడు ఆయన్ని అడ్డుకోవడం తగదని కేంద్రం నుంచి కూటమి ప్రభుత్వానికి ఆదేశాలు రావడంతో జగన్ తిరుపతి రాకుండా అడ్డుకు౦దామని ప్రయత్నించిన కూటమి ప్రభుత్వానికి బిగ్ షాకని వారు అభిప్రాయ పడ్డారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!