YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. జగన్ పాస్ పోర్టును ఐదేళ్ల పాటు రెన్యూవల్ చేసుకోవచ్చని కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వాస్తవానికి ఈ నెల 3 నుంచి జగన్ లండన్ టూర్ మొదలవ్వాలి. తాజాగా వెలువడిన కోర్టు తీర్పుతో వారం రోజులు ఆలస్యంగా జగన్ పర్యటన మొదలుకానున్నట్లు తెలుస్తోంది. పాస్ పోర్ట్ రెన్యూవల్ విషయమై ఇటీవల విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు కేవలం ఏడాది వరకే అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో జగన్ హైకోర్టులో ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. తన పాస్ పోర్టుని ఐదేళ్లకు రెన్యూవల్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టును కోరారు.
జగన్ వేసిన పిటిషన్‌పై వాదనలు విన్న అనంతరం కోర్టు ఈ నెల 11న తీర్పు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇదే క్రమంలో నేడు జగన్ పాస్ పోర్టుని ఐదేళ్ల పాటు రెన్యూవల్ చేసేలా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇది జగన్‌కి ఉన్నత న్యాయస్థానంలో లభించిన భారీ ఊరటగా పేర్కొనవచ్చు. దీంతో ప్రస్తుతం జగన్ విదేశీ పర్యటనకు మార్గం సుగమమైంది.