Tuesday, October 8, 2024

AP Politics:చంద్రబాబు ప్రభుత్వానికి బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నటి కాదంబరీ జెత్వానీ..వైసీపీపై కేసు వెనక్కి

- Advertisement -

AP Politics: ముంబై నటి కాదంబరీ జెత్వానీ ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నాయకులు ముంబై నటి కాదంబరీ జెత్వానీ ఏపీకి పిలిపించి ఆమెపై లైంగిక దాడి చేశారని కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఈ కేసులో పలువురు వైసీపీ నేతలను సైతం ఇరికించడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. ఊరు పేరు లేని నటిని తీసుకువచ్చి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని , ఇందులో ఎటువంటి వాస్తవం లేదని వైసీపీ మొదటి నుంచి కూడా చెబుతూ వస్తోంది.

అయితే ఎలాగైనా ఈ కేసును ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నట్టు కూటమి ప్రభుత్వం కనిపించింది. దీనిలో భాగంగానే ఆ నటిని అమరావతికి పలుమార్లు పిలిపించి విచారణ చేయడం జరిగింది. ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు మరో ఇద్దరు కింది స్థాయి పోలీసు అధికారుల్ని కూడా సస్పెండ్ చేసింది. తాజాగా ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సచివాలయానికి తన లాయర్లతో కలిసి వచ్చిన కాదంబరీ జెత్వానీ హోంమంత్రి వంగలపూడి అనితను కలిశారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పీఎస్ లో తనపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని కోరారు. అయితే దీనిపై హోంమంత్రి అనిత ఆమెకు నేరుగా హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.

ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పి పంపినట్లు తెలుస్తోంది. హోంమంత్రితో భేటీ తర్వాత బయటికి వచ్చిన కాదంబరి లాయర్ నర్రా వెంకటేశ్వరరావు అసలు విషయం బయటపెట్టారు. ఏపీలో కాదంబరిపై పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటే ఇందుకు కారణమైన ముంబైలో పారిశ్రామికవేత్తపై తాము ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దీంతో ఈ మొత్తం వ్యవహారంలో ఇదే టర్నింగ్ అవుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు సన్నిహితుడైన ఆ పారిశ్రామిక వేత్తను వదిలేసి ఏపీలో కూటమి ప్రభుత్వం అప్పట్లో ఆమెను క్షేత్రస్దాయిలో వేధించిన ఐపీఎస్‌లను మాత్రమే సస్పెండ్ చేసింది.

ఇప్పుడు కాదంబరి కోరినట్లుగా ఆమెపై కేసును ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చినట్లవుతుంది. అదే సమయంలో ఆమెకు క్లీన్ చిట్ ఇస్తే ముంబైలో సదరు పారిశ్రామికవేత్తపై ఆమె అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్దమవుతోంది. దీంతో ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలో కూటమి ప్రభుత్వానికి తెలియక తలలు పట్టుకుంటుంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!