Ys jagan: మనం చేసిన పనులకి సరైన గుర్తింపు వచ్చినప్పుడే దాని విలువ మరింత పెరుగుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ని ఓడించి తెలుగుదేశ౦, జనసేన మరియు భాజపా కలిసి కూటమిగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఒక చెంప దెబ్బ లాంటి సందర్భం ఎదురైంది. చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ అధికారంలోకి అయితే రాగలిగారు కానీ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి పనులను అయితే చెరిపి వేయలేక పోతున్నారు. తాజాగా జగన్ మోహన్ రెడ్డి ఆయన హయాంలో చేసిన పనులన్నీ ఇప్పుడు బయట పడి ఇప్పుడు వాటికి గుర్తింపు లభిస్తోంది. రాష్ట్రంలో గతంలో పెట్టుబడులకు ముందుకి రాలేదు ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా పెట్టుబడులు పెట్టే వాతావరణమే లేదంటూ ఎన్నికల ముందు వరకూ చాలా జోరుగా ప్రచారం చేసిన కూటమి నాయకులకి ఇది పెద్ద చెంప దెబ్బ అని చెప్పుకోవచ్చు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పారిశ్రామిక వేత్తల అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన EODB ర్యాంకుల్లో ఇచ్చిన డేటా ప్రకారం ఏపీ రెండవ స్థానంలో ఉంది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ రూపొందించిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక 2022 అమలులో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. దీన్ని బట్టి చూస్తే జగన్ మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమలకి పెద్ద పీట వేసి ఎంతగా ప్రోత్సహించారో అర్థం అవుతోంది. ఆయన హయాంలో పారిశ్రామిక వేత్తలు ఎంత సంతోషంగా ఉన్నారో కూడా మనం గమనించాల్సిన విషయం. ఆయన తీసుకున్న నిర్ణయాలకి ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. గుజరాత్, కర్ణాటక, తెలంగాణా మరియు తమిళనాడు ఇలాంటి రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది.
ఇదే విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ సందర్భంగా పియూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న పారిశ్రామిక సంస్కరణలను ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్ పని తీరుని కొనియాడారు. 2022 లో జగన్ తీసుకున్న నిర్ణయాలు ఆయన కార్యాచరణ అద్భుతం అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సంస్కరణలు అమలు చేసిన తర్వాత వీటిని వినియోగించుకున్న వారిని రాండమ్ గా సర్వే చేసి వారు ఇచ్చిన స్పందన ఆధారంగా ఈ ర్యాంకులు వెల్లడించారు. రాష్ట్రం నుంచి పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నారు అంటూ ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? స్వయంగా కేంద్ర మంత్రి జగన్ పైన ప్రశంసలు కురిపిస్తుండటంతో తట్టుకోలేకపోతున్నారు కూటమి నాయకులు. మొత్తానికి తాము భాగస్వామ్యంలో ఉన్న ప్రభుత్వాన్ని కాకుండా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మంత్రి ఇలా ప్రశంసిస్తుంటే మోడీ కూడా బాధ పడుతున్నట్లు సమాచారం.