Andrapradesh:ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత మొదలైందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రభుత్వం వచ్చిన కేవలం నాలుగు నెలల్లోనే దేశంలో ఎలాంటి రాష్ట్రంలోనూ ప్రభుత్వం పట్ల ఇంత వ్యతిరేకత రాలేదు అని చెప్పవచ్చు. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రవర్తించిన తీరు కావొచ్చు లేదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై మరియు కార్యకర్తలపై జరిపించిన దాడులు కావొచ్చు ఇలా కారణం ఏదైనా కానీ కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది. ఏ సంక్షేమ పథకాలైతే జగన్ కి అఖండ విజయం సాధించేలా చేశాయో అవన్నీ పక్కన పెట్టేసింది కూటమి ప్రభుత్వం. ఇది కూటమి ప్రభుత్వానికి మైనస్ అవ్వడమే కాకుండా ఆ పార్టీ కుప్పకూలడానికి పునాది పడినట్లు అయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల కూటమి ప్రభుత్వం పర్వర్తిస్తున్న తీరు చూస్తుంటే జగన్ ని కాదని ఓట్లు వేసిన ప్రజలు ఇప్పుడు మళ్ళీ జగన్ కావాలని కోరుకునేలా చేస్తుండటంతో ఇక కూటమి ప్రభుత్వం ఆశలు దాదాపుగా గల్ల౦తు అయినట్లే.
భిన్న వైఖరితో ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు పట్ల ఎన్డీయే నాయకత్వంలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తాజాగా విజయవాడలో వరదలు సృష్టించిన భీభత్సం నేపధ్యంలో కూడా కూటమి ప్రభుత్వం తీరు ప్రజలు ఆశించిన విధంగా లేకపోవడంతో వారు చాలా నిరాశ చెందినట్లు తెలుస్తోంది. జగన్ మోహన్ రెడ్డి హయాంలో నిర్మించిన రిటైనింగ్ వాల్ కారణంగానే విజయవాడ పూర్తిగా మునిగిపోలేదని ఆయన ముందుచూపు వల్లే తాము ఇంకా బ్రతికే ఉన్నామని ప్రజలు జగన్ మోహన్ రెడ్డిని కొనియాడారు. అలాగే వాతావరణ శాఖ ముందస్తుగా ఇచ్చిన హెచ్చరికలను ప్రభుత్వం లెక్క చేయకుండా ముందుచూపు లేకుండా ప్రవర్తించడం వల్లే ఈరోజు విజయవాడ ప్రజలు ఇంత నష్టపోయారని జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత రాజకీయాలకి ప్రకృతి సైతం కన్నెర్ర చేసిందని ప్రస్తుతం ప్రజల్లో వినిపిస్తున్న వాదన. దీనికి మూల్యమే తాజాగా విజయవాడలో జరిగిన ఘటన అని చర్చి౦చుకుంటున్నారు జనం. మూడు నాలుగు రోజులు ప్రజలు నీళ్ళలోనే ఉంటే కనీసం మంచి నీళ్ళు కూడా ప్రభుత్వం అందించలేకపోయిందని ప్రజలు వాపోతుంటే కేంద్రంలోని పెద్దలు సైతం తలదించుకునే పరిస్థితి ఉంది. ఇవన్నీ గమనిస్తున్న ఎన్డీయే పెద్దలు చంద్రబాబు రాజకీయ అనుభవం చూసి తాము మోసపోయామని భావిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు కంటే జగన్ మోహన్ రెడ్డి చాలా బెటర్ అని జగన్ హయాంలో తమకు ఇలాంటి ఇబ్బందులు రాలేదని మోడీ ఎన్డీయే నాయకులతో అన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇటు ప్రజలని అటు ఎన్డీయే నాయకత్వంని సంతృప్తి పరచడంలో కూటమి ప్రభుత్వం ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు.