Saturday, October 5, 2024

AP POLITICS: సొంత లాభం చూసుకోనున్న కూటమి.. సోషల్ మీడియా పోస్టుల సృష్టి

- Advertisement -

AP POLITICS: అవసరానికి తగినట్లుగా పరిస్థితులను సృష్టించుకోవడంలో, దేన్నయినా తమకు అనుకూలంగా మార్చుకోవడంలో టీడీపీ తర్వాతే ఎవరైనా. ఒకవైపు అప్పులు, మరోవైపు వరద విపత్తుతో రాష్ట్రం అల్లాడుతుంటే సొంత లాభం చూసుకుంటోంది అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం. పార్టీకి సంబంధించిన కొందరు వ్యక్తుల ఉపాధి నిమిత్తం ఏ­కం­గా సోష­ల్‌ మీడియా పోస్టులను సృష్టించింది చంద్రబాబు సర్కారు. ఇలా పోస్టులను సొంతంగా సృష్టించి భర్తీ చేయడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి. మంత్రుల పేషీల్లో పని చేయడం కోసం మొత్తం 44 సోషల్‌ మీడియా పోస్టులను సృష్టించింది. ఆ పోస్టులను ఆంధ్రప్రదేశ్‌ డిజిటల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ద్వారా భర్తీ చేస్తూ పార్టీ వ్యక్తులకు ఉపాధి కల్పించనుంది. ఇందుకు సంబంధించి డిజిటల్‌ కార్పొరేషన్‌ లిమిడెట్‌ తాజాగా ఎంప్లాయ్‌మెంట్‌ నోటీసు కూడా జారీ చేసింది. 24 మంది మంత్రుల పేషీల్లో 24 మంది సోషల్‌ మీడియా ఎగ్జిక్యూటివ్స్‌ను, మరో 24 మంది సోషల్‌ మీడియా అసిస్టెంట్స్‌ను ఈ మేరకు భర్తీ చేయనున్నట్లు ఆ నోటీసులో పేర్కొనడం గమనార్హం.

చేసిన అభివృద్ధి, ప్రభుత్వ ప్రగతి కళ్లకు కనబడకపోయినా అబద్దపు ప్రచారాలతో ఇ­మే­జ్‌ పెంచుకోవడమే ఈ సోషల్ మీడియా పోస్టుల సృష్టి వెనక అసలైన కారణం. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను, పార్టీ నేతల సందేశాలను సోషల్‌ మీడియా ఖా­తాల ద్వారా ప్రజల్లోకి బలంగా తీ­సుకువెళ్లడమే దీని ముఖ్య ఉద్దేశ్యం

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!