Sunday, September 8, 2024

Ys jagan-Chandrababu:జగన్ కాలర్ ఎగరేసుకునే పని చేసిన విజయసాయి రెడ్డి – చంద్రబాబు కి నమ్మలేని షాక్

- Advertisement -

Ys jagan-Chandrababu:ఏపీలోని విజయవాడ నగరానికి ఓవైపు కృష్ణానది వరదలు, మరోవైపు బుడమేరు వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో అమరావతి రాజధాని భద్రతపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సందేహాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. విజయవాడలో తాజా పరిస్ధితుల నేపథ్యంలో అమరావతి రాజధాని భద్రత ప్రశ్నార్ధకంగా మారిందంటూ సాయిరెడ్డి పెట్టిన పోస్టు ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. మరోవైపు విజయవాడ వరదలకు 32 మంది చనిపోయిన అంశంపై సాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు. ఇందులో 32 మరణాలకు బాధ్యులెవరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా చర్యలు తీసుకోకపోవడాన్ని ఇందులో ఆయన ప్రస్తావించారు. ఘటన జరిగిన తర్వాత విరాళాలు వసూలు చేయడం అటుంచి ముందుగా చర్యలు తీసుకుని దాన్ని నివారించాల్సిన అవసరాన్ని విజయ సాయిరెడ్డి ప్రభుత్వానికి గుర్తుచేశారు.

మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ క్షేత్రస్దాయికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించడాన్ని కూడా విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. ఇప్పటికే జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇవే అంశాల్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెంచేందుకు ఈ అంశాల్ని ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. తద్వారా వరదల నియంత్రణలో, మరణాలను ఆపడంలో ప్రభుత్వం విఫలమైందనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!