Jagan- Chandrababu: రాష్ట్రంలో ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎంత మేలు చేశాం అనేది ముఖ్యం. ఎన్ని పర్యాయాలు అధికారంలో ఉన్నాం అనే విషయం కంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి ఉపయోగపడే పనులు ఎన్ని చేశాం అనేదే ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ లో గడిచిన అయిదేళ్ళ కాలంలో జగన్ మోహన్ రెడ్డి పాలన చూసాం. జాతీయ స్థాయిలో విడుదలయ్యే లెక్కల్ని ఎవరూ మార్చలేరు. ఎవరైనా సరే అవి ఒప్పుకొని తీరాల్సిందే. రాష్ట్రానికి తలసరి ఆదాయ౦ అనేది చాలా ముఖ్యం. ఈ ఆదాయాన్ని బట్టే ప్రజలకి ఉపయోగపడే సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది ప్రభుత్వం. రాష్ట్ర అభివృద్ధి ఈ తలసరి ఆదాయం మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రజల జీవన ప్రమాణాలని పెంచడానికి తమ రాష్ట్రాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్ళడానికి ఈ తలసరి ఆదాయమే ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తరువాత 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. 2019 నుంచి 2024 వరకు జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో తలసరి ఆదాయ౦ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అంటే 2019 నుంచి 2024 వరకు భారీగా పెరిగింది. ఇది చెప్పింది ఎవరో కాదు స్వయంగా ఆర్బీఐ. ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2023 – 2024 దేశీయ ఆర్ధిక వ్యవస్థ గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించిన ఈ డేటాని చూస్తే తెలిసిపోతుంది జగన్ హయాంలో మన రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని అంటే అభివృద్ధి కూడా బాగా జరిగిందని. చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ జగన్ ని విమర్శించే ముందు ఈ విషయం గురించి ఆలోచన చేయాలని వైసీపీ నాయకులు అంటున్నారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన హ్యాండ్ బుక్ లో గత 10 సంవత్సరాల్లో వివిధ రాష్ట్రాల్లో తలసరి ఆదాయం పెరుగుదల వివరాలు ఉన్నాయి. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కంటే 2019 నుంచి 2024 వరకు జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే మన రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగినట్లు అందులో ఉంది.
ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా తొలిసారి అధికారంలోకి వచ్చిన జగన్ ఈ స్థాయిలో రాష్ట్ర తలసరి ఆదాయాన్ని పెంచడం అనేది చిన్న విషయం కాదని ప్రజలు అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం గతంలో ఒక సందర్భంలో జగన్ మోహన్ రెడ్డి మంచి గవర్నెన్స్ వల్లే రాష్ట్రానికి మంచి తలసరి ఆదాయం వస్తుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం 88 కోట్ల రాష్ట్ర తలసరి ఆదాయం చంద్రబాబు అయిదేళ్ళ పాలనలో ఎంత పెరుగుతుందని మనం వేచి చూడాల్సిందే. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని తలసరి ఆదాయం తగ్గుతుందని ప్రజలని నమ్మించారు చంద్రబాబు అప్పట్లో. కానీ ఇప్పుడు జగన్ హయాంలో అది పెరగడం చంద్రబాబు కలలో కూడా ఊహించని పరిణామమని జగన్ కి ఈ విషయం పట్ల కేంద్రంలో గౌరవం పెరిగిందని కొందరు వైసీపీ నాయకులు అంటున్నారు.