SENSATIONAL BREAKING : తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చిన కాలం నుంచి కూడా ఈవీఎంల గోల చాలా రచ్చ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒంగోలు వైకాపా అభ్యర్ధి బాలినేని శ్రీనివాస్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు ఫిర్యాదు చేసిన విధానం ఆయన అడుగులు వేస్తున్న తీరు పెను సంచలనానికి దారి తీస్తుంది. ఎన్నికల కమిషన్ కి తాను ఫిర్యాదు చేసి ఒంగోలులో పన్నెండు కేంద్రాలలో తనకు అనుమానం ఉందని వ్యక్త పరిచాడు. సాధారణంగా ఎన్నికలు ముగిశాక 45 రోజుల పాటు ఈవీఎంల లోని డేటా ని అలాగే వీవీ ప్యాడ్లలోని స్క్రిప్టులని భద్రపర్చాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ కి ఉంటుంది. కానీ ఎన్నికల కమిషన్ అలా చేయలేదు. రీ వెరిఫికేషన్ లాంటివి ఏమి చేయకుండా ఎదో మాక్ పోలింగ్ లాంటివి చేసి ఎన్నికల కమిషన్ చేతులు దులుపుకుందామని ప్రయత్నం చేసింది. సుప్రీమ్ కోర్ట్ ఈ విషయంలో ఇప్పటికే ఒక తీర్పు ఇచ్చింది. ఏ అభ్యర్ధి అయినా ఇలా ఫిర్యాదు చేస్తే వాళ్ళ అనుమానం నివృత్తి చేసే బాధ్యత ఎన్నికల కమీషన్ కి ఉంటుంది అని. ఆ ఫిర్యాదుదారుడి ముందే రీ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది అని సుప్రీమ్ కోర్ట్ చెప్పింది. ఈ తీర్పు ఆధారంగానే బాలినేని ఫిర్యాదు చేశారు. ఒకవేళ బాలినేని గనుక సుప్రీమ్ కోర్ట్ మెట్లు ఎక్కితే రీ వెరిఫికేషన్ చేయమని ఆదేశం ఇస్తుంది సుప్రీమ్ కోర్ట్. అప్పుడు డేటాని తొలగించేశాము అని ఎన్నికల సంఘం చెప్తే కచ్చితంగా ఒంగోలులో రీ ఎలక్షన్ జరగాల్సిందే అని సుప్రీమ్ కోర్ట్ తీర్పు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కక్షపూరిత రాజకీయాలు రెడ్ బుక్ రాజకీయాలు చేస్తూ ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకుంటోంది అని రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తున్న చర్చ. ముంబైలో ఎవరో ఒక లేడీ ఎవరినో హనీ ట్రాప్ చేస్తే ప్రజా సమస్యలు పక్కన పెట్టేసి ఆమె చుట్టూ అధికార యంత్రాంగం తిరగడం ఎంత వరకు సమంజసం అని ప్రతిపక్ష వర్గాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. కలుషిత ఆహారం కారణంగా విద్యార్ధులు ఆసుపత్రి పాలైతే దాని వెనుక వైసీపీ కుట్ర ఉందని ప్రభుత్వం ఈ విషయాన్ని కూడా రాజకీయం చేయడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇటీవల విజయవాడలో వరదలు వచ్చిన సందర్భంలో ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్దకు వరద ఎక్కువ అయ్యి కొట్టుకు వచ్చిన బోట్ల విషయంలో కూడా వైసీపీ హస్తం ఉందని ఆ విషయాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కూడా అది వైసీపీ కుట్ర అని మాట్లాడటం ఎంత వరకు న్యాయమని వైసీపీ అభిమానులు కూటమి ప్రభుత్వ తీరు పట్ల చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వీటినే డైవెర్షన్ పాలిటిక్స్ అంటారని ప్రభుత్వ౦ ప్రజల సమస్యలు తీర్చకుండా ప్రతీదీ వైసీపీ పైన ఆ పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన నెట్టేసి కాలం గడపాలని చూస్తున్నట్లు జగన్ అభిమానులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ అంతా ఈవీఎంల టాంపరింగ్ జరిగినట్లు నిరూపితమైతే అలాగే కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరుని ప్రజలు వ్యతిరేకిస్తే మరోసారి ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు రాక తప్పవని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు.