Tuesday, October 8, 2024

TDP: టీడీపీ నుంచి మరో ఎమ్మెల్యే అవుట్..?

- Advertisement -

TDP: ఓ టీడీపీ ఎమ్మెల్యే తీరు అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. తొలిసారి ఎమ్మెల్యే కావడంతో అవగాహనలేమి తనంతో ఆయన చేస్తోన్న పనులు పార్టీతో పాటు, ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు తీసుకువస్తోంది. పిలిచి మరి టికెట్ ఇచ్చి గెలిపిస్తే ,ఇప్పుడు పార్టీనే ఇరాకటంలో పెట్టేలా ఆ ఎమ్మెల్యే వ్యవహరించడం సంచలనంగా మారింది. గెలిచిన నెలలోనే సదరు ఎమ్మెల్యేపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వైసీపీకి చెందిన నాయకుడు ఇంటిపైకి పార్టీ శ్రేణులను తీసుకువెళ్లి నానాయాగి చేశారాయన.

ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే సదరు ఎమ్మెల్యే వైసీపీకి చెందిన నాయకుడు ఇంటిని కూల్చివేశారు. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు ఆ ఎమ్మెల్యేకు చీవాట్లు కూడా పెట్టారు. ఇదే విధంగా రోడ్లు వేయలేదని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనగా రోడ్డు మీద ఉన్న అక్కడే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం రోడ్డు వేయడానికి ఉత్తర్వులు జారీ చేసిందని, ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం దానికి సంబంధించిన పనులను మొదలుపెట్టాల్సి ఉందని తెలపడంతో ఆ ఎమ్మెల్యే సైలెంట్‌‌గా అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ఇక తాజాగా ఆ ఎమ్మెల్యే మరో వివాదంలో చిక్కుకున్నారు. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన డ్వాక్రా మ‌హిళ‌ల‌పై బూతులు మాట్లాడ్డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. అంతేకాదు, మ‌హిళ‌ల‌ను అధికారికంగా ఐదు గంట‌ల పాటు పోలీస్‌స్టేష‌న్‌లో పెట్ట‌డం ద్వారా ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ఏర్ప‌డేలా చేసింది. ఆ ఎమ్మెల్యే వ్య‌వ‌హార శైలి నియోజ‌క‌వ‌ర్గంలోనే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా వ్య‌తిరేక ముద్ర ప‌డేలా చేస్తోంద‌న్న భ‌యం టీడీపీలో నెల‌కుంది. దీంతో ఆ ఎమ్మెల్యేను ఎలా నిరోధించాలో అర్థం కాక టీడీపీ అధినేత త‌ల ప‌ట్టుకుంటున్నారు.ఆ ఎమ్మెల్యేను ఇలాగే వ‌దిలేస్తే, రానున్న రోజుల్లో ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.దీంతో ఆ ఎమ్మెల్యే ఎక్కువ కాలం పార్టీలో ఉండే అవకాశం లేదని టీడీపీ శ్రేణులే చర్చించుకుంటున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!