Tuesday, October 8, 2024

Revanth Reddy: రేవంత్ సర్కారుకు మరో షాక్.. స్థానిక సంస్థలు ఇప్పట్లో లేనట్టే

- Advertisement -

Revanth Reddy: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. క్షేత్రస్థాయిలో పట్టుబిగించాలని చూస్తోంది. ఇప్పటివరకూ స్థానిక సంస్థలు బీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడాదవుతున్నా ఇంకా పల్లెలపై కాంగ్రెస్ పార్టీకి పట్టు దొరకడం లేదు. అక్కడ బీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు ఉండడమే అందుకు కారణం. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పడొస్తాయా? అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆశగా ఎదురుచూస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. కోర్టు కేసులు చుట్టుముడుతుండడం, కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఎన్నికలు నిర్వహిస్తే ఇబ్బందులు వచ్చే అవకాశాలున్న ద్రుష్ట్యా వాయిదాకే రేవంత్ సర్కారు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.

లోక్‌సభ ఎన్నికల ఉత్సాహంతో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇదే ఉత్సాహంతో స్థానిక సంస్థలకు సిద్ధమవుతున్న రేవంత్‌ రెడ్డి సర్కార్‌కు భారీ షాక్‌ తగిలింది. ఎన్నికలు కొన్ని వారాల్లో నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా అనూహ్యంగా న్యాయస్థానం రంగంలోకి దిగడంతో స్థానిక సంస్థల ఎన్నికలు మరో ఐదారు నెలలు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ముందు బీసీ గణన చేపట్టాల్సి ఉంది. బీసీ గణన అనంతరం అందులో వచ్చిన లెక్కల ప్రకారం స్థానిక సంస్థలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. ఇదంతా జరిగేందుకు కొన్ని దాదాపు మూడు నుంచి 4 నెలలు పట్టనుంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ముందుకు జరగనున్నాయి. అయితే హైకోర్టు తీర్పును పట్టించుకోకుండా ఎన్నికలకు వెళ్తే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఎన్నికలకు కొన్ని నెలలు ఆలస్యం చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

గత ఏడాది తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి సానుకూల ఫలితాలు వచ్చాయి. అసెంబ్లీలో అధిక స్థానాలు సాధించి అదికారంలోకి వచ్చింది. మెజార్టీ ఎంపీ స్థానాలను సైతం దక్కించుకుంది.శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికే ఈ ఎన్నికలు త్వరలో చేపట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటుండగా ఈ వ్యవహారంలో హైకోర్టు కల్పించుకోవడంతో బిగ్‌ షాక్‌ తగిలింది. బీసీ గణన త్వరగా చేపట్టాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. బీసీ గణన చేపట్టాక స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశించింది. అనంతరం ఈ విచారణను మూడు నెలలకు వాయిదా చేసింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో తెలంగాణలో మూడు నెలల వరకు స్థానిక సంస్థల ఎన్నికలు అవకాశం కనిపించడం లేదు.

తెలంగాణలో బీసీలు అధికం. కానీ బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం జనాభాకు తగ్గట్టు లేదని ఆయా వర్గాల్లో అసంత్రుప్తి ఉంది. అందుకే బీసీల గణన పూర్తయ్యే వరకు తెలంగాణలో జెడ్పీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించవద్దని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో కోరారు. ఇటీవల ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రభుత్వ అభిప్రాయం తెలుసుకుంది. విచారణ సందర్భంగా తెలంగాణ అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి వాదిస్తూ ‘రాష్ట్రంలో బీసీల గణన పూర్తి చేసేందుకు 2 నుంచి 3 నెలల సమయం పడుతుంది’ అని ప్రభుత్వం తరఫున కోర్టుకు తెలిపారు. ‘స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం రాష్ట్రంలో బీసీల గణన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అని న్యాయస్థానానికి విన్నవించారు.ప్రభుత్వ వాదన విన్న ధర్మాసనం బీసీ గణన త్వరగా చేపట్టాలని ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ సీజే అలోక్ ఆరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన డివిజన్ బెంచ్‌ వాదనలు వినిపించింది. ఈ పిటిషన్‌పై తదుపరి తీర్పును 3 నెలలకు వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్థానిక సంస్థలు మరికొన్నాళ్లు ఆలస్యంగా జరిగే అవకాశం ఉంది. బీసీ కుల గణన పూర్తయ్యాకే స్థానిక ఎన్నికలు జరనున్నాయి. అయితే ఇది ఒక విధంగా కాంగ్రెస్ పార్టీకి షాకింగ్ పరిణామమే అని చెప్పాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!