Thursday, October 3, 2024

BRS PARTY: బీఆర్ఎస్ లో బీసీలకు మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు

- Advertisement -

BRS PARTY : బీఆర్ఎస్ బీసీలపై ఫోకస్ పెట్టందా? పార్టీ బలోపేతంలో భాగంగా బీసీలను ఆకర్షించే ప్రయత్నంచేస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.తెలంగాణలో బీసీ జనాభా దాదాపు 56 శాతం.. రాష్ట్రవ్యాప్తంగా యాదవ, గౌడ, ముదిరాజ్ ఇలా బీసీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు అన్ని సెగ్మెంట్లలో కీలకంగా ఉన్నారు. ఎన్నిక ఏదైనా రాష్ట్రంలో డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌ మాత్రం బీసీలే.. ఆయా వర్గాల ఓట్లు 50 శాతానికి పైగా ఉంటాయని గణాంకాలు చెప్తున్నాయి. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ బీసీలను దూరం చేసుకుని అధికారం కోల్పోయింది. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై కోపంతో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆ సామాజికవర్గానికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. ఆ ఇంపాక్ట్ ఎన్నికల ఫలితాల్లో స్పష్టం కనిపించింది.

గత ఎన్నికల్లో దాదాపు బీసీలు గులాభీ పార్టీకి దూరమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలంతా గంపగుత్తగా కాంగ్రెస్‌వైపు మళ్లడంతో గులాబీ పార్టీ హ్యాట్రిక్‌ ఆశలు గల్లంతయ్యాయి. మూడోసారి సీఎం పీఠం అధిరోహించాలని అనుకున్న కేసీఆర్‌ కలలు కల్లలుగా మిగిలిపోవడానికి కారణం బీసీ ఫ్యాక్టరేనని గులాబీ శ్రేణులే అంటున్నాయి. ఆ ఎఫెక్ట్‌తోనే కనీసం ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయామంటూ గులాబీ పార్టీ నేతలు తెగ బాధపడిపోతుంటారు. అధికారం కోల్పోయి.. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కుకుండా పోయాక గులాబీ పెద్దలకు జ్ఞానోదయం అయినట్లు కనిపిస్తుంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీసీలను తమ వైపునకు తిప్పుకోవాలని గులాబీ పార్టీ ప్లాన్‌ చేస్తున్నట్టు కనిపిస్తుంది. వాతావరణాన్ని అనుకూలంగా మల్చుకోవడానికి అనువైన అంశం కోసం చూస్తున్న గులాబీ పార్టీ.. ఇప్పుడు బీసీ కుల గణన టాపిక్‌ అందుకుందట.

అసలు రాష్ట్ర జనాభాలో బీసీలు ఎంత మంది ఉన్నారో లెక్కించాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేస్తోంది. బీసీ డిక్లరేషన్ పేరు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఇప్పుడు దానిని వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పట్టుపడుతోంది. బీసీల కులగణన జరిగితేనే లోకల్ ఎలక్షన్లలో ఆయా సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందన్న రాగాన్ని అందుకుంది బీఆర్ఎస్.వాస్తవానికి గులాభీ పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఇన్నాళ్లూ ప్రత్యేకంగా సమావేశాలు పెట్టుకునేవారు. కానీ.. ఇకపై పూర్తి స్థాయిలో పార్టీ పరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. బీసీ అజెండాతో ముందుకు పోవాలని బీఆర్ఎస్ భావిస్తోందంట. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏకంగా పీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకు కట్టబెట్టింది. ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా తమ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీకే ఇవ్వాలని చూస్తుందంటున్నారు.

అయితే రెండు జాతీయ పార్టీలు బీసీల మాట వినిపిస్తుండడంతో బీఆర్ఎస్ సైతం ఫాస్టుగా ఆలోచించడం ప్రారంభించింది పార్టీ పరంగా ఆ వర్గానికిఎలాంటి ఉన్నత పదవి ఇవ్వాలో వెతికే పని మొదలుపెట్టిందట గులాబీ అధిష్టానం. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించేలా వ్యూహరచన చేస్తోందంట.ఇంకో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పోస్ట్‌ను కల్పించి ఆ పదవి బీసీకి ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారంట గులాబీ పార్టీ పెద్దలు. అలాగే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన బీసీ నేతల్ని యాక్టివ్ చేసే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. బీసీల దగ్గరికి బీసీలు వెళ్తేనే వర్కవుట్‌ అవుతుందన్న ఆలోచనతో పార్టీలోని సీనియర్‌ బీసీ లీడర్స్‌ని ఫీల్డ్‌కు పంపే ఆలోచన చేస్తున్నారంట. బీసీలకు ఏం కావాలో.. అందుకు పార్టీ ఏం చేస్తుందో.. ఆ విషయాన్ని ఆయా సామాజికవర్గాల నేతలతోనే చెప్పించి వారిని దగ్గర చేసుకోవాలని చూస్తున్నారంట.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!