Sunday, October 13, 2024

YS Jagan: జగన్ కి వెన్నుపోటు పొడిచి వెళ్ళిన బాలినేని కి బ్యాడ్ న్యూస్ — బొక్క బోర్లా పడ్డాడు

- Advertisement -

YS Jagan: వైఎస్సార్సీపీకి బాలినేని శ్రీనివాస రెడ్డి రాజీనామా చేసిన విషయం మనకి తెలిసిందే. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు జగన్‌కు తన రాజీనామా లేఖ పంపారు. కొన్ని కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖలో ఆయన కీలక విషయాలను ప్రస్తావించారు. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరన్నారు. జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు వ్యతిరేకించినట్లు చెప్పారు. రాజకీయాల్లో భాష గౌరవంగా, హుందాతనంగా ఉండాలన్నారు. రాజకీయాల్లో విలువలు కాపాడాల్సిన బాధ్యత నాయకులదే అని పేర్కొన్నారు. ఇప్పుడు కొన్ని కారణాలతో వైసీపీ వీడుతున్నట్లు తెలిపారు.

కొన్నాళ్లుగా వైసీపీ హైకమాండ్‌పై బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంత్రి పదవి నుంచి తప్పించినప్పుడు ఆయన అలక బూనారు. వైవీ సుబ్బారెడ్డితో ఎప్పటి నుంచో బాలినేనికి విభేదాలు ఉన్నాయి. ఎంపీ టికెట్ విషయంలోనూ బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్ష పదవి విషయంలోనూ బాలినేని అసంతృప్తి వ్యక్తం చేశారు. బాలినేనిని జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించి జెంకె వెంకటరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈ చర్యలతో పార్టీలో బాలినేనికి పట్టు లేకుండా పోయింది.

ఆ తర్వాత ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు విషయంలోనూ బాలినేని కొంత అసంతృప్తి వ్యక్తంచేశారు. మాగుంటకు వైసీపీ ఎంపీ టికెట్ ఇవ్వాలని బాలినేని పట్టుబట్టారు. కానీ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి పార్టీ టికెట్ ఇచ్చింది. చివరకు తన టికెట్ విషయంలోనూ పార్టీలో చర్చ జరిగింది. ఒంగోలు కాకుండా గిద్దలూరు లేదంటే దర్శిలో పోటీ చేయాలని అప్పట్లో పార్టీ ప్రతిపాదించినట్టు ప్రచారం. ఈ విషయాలు బాలినేనిలో అసంతృప్తికి కారణమైంది. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత అది మరింత ఎక్కువైంది.

ఈ నేపథ్యంలో బాలినేనితో పార్టీ అధిష్టానం చర్చలు జరిపింది. ఇటీవలే అధినేత వైయస్ జగన్‌తో బాలినేని భేటీ అయ్యారు. పార్టీలో కొనసాగే పరిస్థితులు లేవనీ తన దారి తాను చూసుకుంటున్నట్టు జగన్‌కు చెప్పేశారు. కష్టకాలంలో పార్టీని విడిచి జగన్ కు బాలినేని వెన్నుపోటు పొడిచారని కొందరు వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. ఆయన పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యి త్వరలో జనసేనలో చేరనున్నట్లు ప్రకటించారు. ఒంగోలులో ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి అప్పుడు జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిపారు.

కానీ ఆయనతో పాటు ఒంగోలులో వైసీపీ కార్యకర్తలు మరియు క్యాడర్ పార్టీని వీడటానికి సముఖత చూపించడం లేదని సమాచారం. పార్టీ నుంచి చాలా కీలకమైన మరియు సీనియర్ వ్యక్తి అయినా బాలినేని వెళ్ళిపోయినా సరే జగన్ మోహన్ రెడ్డి అనుచరగణం తగ్గదని వైసీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆయన పార్టీలో చేరిన తరువాత ఇస్తామన్న పదవి ఇచ్చేందుకు ఇప్పుడు సిద్ధంగా లేదంట కూటమి ప్రభుత్వం. దీంతో జగన్ కి వెన్నుపోటు పొడిచి పార్టీ వీడి వెళ్ళిన బాలినేని ఇవి బ్యాడ్ న్యూస్ అని ఆయన బొక్క బోర్లా పడ్డాడని వైసీపీ శ్రేణులు అభిప్రాయ పడ్డారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!