Friday, October 4, 2024

Jagan: జగన్ కి వెన్నుపోటు పొడిచిన 5 గంటల్లో బాలినేని కి చావు దెబ్బ !

- Advertisement -

Jagan: ఒంగోలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కొంతకాలంగా జరుగుతున్న ప్రచారాన్ని ఎట్టకేలకు నిజం చేశారు. బుధవారం తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు పంపారు. పార్టీ అధినేత నిర్ణయాలపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న బాలినేని జనసేనలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. గురువారం విజయవాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ కాబోతున్నాడని ఈ భేటీ అనంతరం జనసేనలో ఎప్పుడు చేరబోయేది ప్రకటించనున్నట్లు ఆయన అనుచరులు తెలిపారు.

ఇక జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు విభేదించానని కొన్ని వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్లు బాలినేని తెలిపారు. రాజకీయాల్లో విలువలు కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని అందుకే వైసీపీ నుంచి తప్పుకుంటున్నట్లుగా ఆయన చెప్పారు. బాలినేని జగన్ కు దగ్గరి బంధువు అవుతారు. దీంతో రాజకీయాలు వేరు బంధుత్వాలు వేరని మరియు రాజకీయాల్లో భాష గౌరవంగా, హుందాతనంగా ఉండాలని పేర్కొన్నారు. రాజకీయాల్లో విలువలు కాపాడాల్సిన బాధ్యత తమదేనని అన్నారు. ఆ విలువలను నమ్ముకొని ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేశాడని రాజకీయాలకు అతీతంగా ఎవరు వచ్చినా సాయం చేశానని బాలినేని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో ఒంగోలు అసెంబ్లీ నుంచి 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని 2019లో జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. అయితే క్యాబినెట్ మార్పులో బాలినేని పేరు తొలగించడంతో ఆయన అసంతృప్తి చెందారు.

చాలా కాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సాగుతున్న దాగుడు మూతలు మరియు అలకల పర్వం ఎట్టకేలకు ముగిస్తూ ఆయన ఫుల్ స్టాప్ పెట్టారు. కానీ ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన జగన్ కి వెన్నుపోటు పొడిచి పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళడం సమంజసం కాదని ఆ పార్టీ నేతలు అభిప్రాయ పడ్డారు. పార్టీని వీడనున్నట్లు ప్రచారం జరిగిన తరువాత జగన్ మోహన్ రెడ్డి బాలినేనితో భేటీ అయ్యి చర్చలు జరిపారు. ఆ చర్చలు విఫలమయ్యాయని జగన్ ని మోసం చేశారని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఎలాంటి కారణాల రీత్యా ఆయన రాజీనామా చేస్తున్నారో కూడా చెప్పకపోవడం దారుణం అని వారు అభిప్రాయ పడ్డారు. అయితే ఈవీఏం లలో అవకతవకల పైన బాలినేని పోరాడుతున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. బాలినేనిని తమ పార్టీలో చేర్చుకోవాలంటే ఆ కేసు వెనక్కి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆయన కోరనున్నట్లు ఒకవేళ ఇదే జరిగితే జగన్ కి వెన్నుపోటు పొడిచిన బాలినేనికి ఇది ఒక చావు దెబ్బ అని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!