Friday, October 4, 2024

BIG BIG BIG బ్రేకింగ్ : ఏపీలో మధ్యంతర ఎన్నికలకి లైన్ క్లియర్ – జగన్ ఫుల్ హ్యాపీ !

- Advertisement -

BIG BIG BIG బ్రేకింగ్ : ఏపీలో మధ్యంతర ఎన్నికలకి లైన్ క్లియర్ – జగన్ ఫుల్ హ్యాపీ ! దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా కేంద్ర కేబినెట్ తాజాగా ఒకే దేశం-ఒకే ఎన్నికల ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. త్వరలో పార్లమెంట్ లోనూ ఈ మేరకు బిల్లు పెట్టేందుకు సిద్ధమవుతోంది. దీంతో దేశంలో మిగతా రాజకీయపార్టీలతో పాటు ఏపీలో తాజాగా ఎన్నికైన ఎన్డీయే సర్కార్ లో భాగస్వాములైన టీడీపీ, జనసేనలో టెన్షన్ మొదలైంది. అదే సమయంలో విపక్ష వైసీపీకి ఈ ప్రతిపాదన కాస్త ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు. కేంద్రం పార్లమెంటులో జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తే ఏపీలోనూ మరియు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగిపోతాయి. అయితే వచ్చే ఐదేళ్లలో ఎప్పుడైనా ఇవి జరిగే అవకాశముంది. దీంతో ఏపీలో తాజాగా ఎన్నికైన కూటమి ప్రభుత్వం పూర్తి కాలం అధికారం చెలాయించే పరిస్ధితి లేదని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో మధ్యంతర ఎన్నికలకు కూటమి పార్టీలతో పాటు విపక్ష వైసీపీ కూడా సిద్దం కావాల్సి ఉంటుంది.

ఏపీలో ఈసారి కచ్చితంగా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కేంద్రం దూకుడును చూస్తే అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ భాగస్వాములుగా ఉన్న మూడు పార్టీలు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకోవాల్సిన పరిస్ధితి కనిపిస్తోంది. అందుకే రాష్ట్రంలో వైసీపీ నుంచి జనసేనలోకి నేతల చేరికల వేగం పెరిగిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదే సమయంలో మధ్యంతర ఎన్నికల్లోనూ కూటమి పార్టీలు కలిసి పోటీ చేస్తాయా లేదా అన్న చర్చ కూడా నడుస్తోంది. జనసేన వేగంగా బలం పెంచుకోవడం చూస్తుంటే భవిష్యత్ గురించి లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీడీపీ మాత్రం బీజేపీతో కలిసి ప్రయాణం చేసేందుకే మొగ్గు చూపుతోందని అంటున్నారు. బీజేపీ మాత్రం టీడీపీ లేకుండా జనసేనతో కలిసి ఏదో ఒక రోజు ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని బీజేపీ నాయకులు భావిస్తున్నారట.

దేశ వ్యాప్తంగా జమిలీ ఎన్నికల నిర్వహణకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు వైసీపీకి ఆయాచిత వరంగా మారబోతున్నాయి. ఎందుకంటే తాజాగా సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ కేంద్రం తాజా ప్రయత్నాలతో ఐదేళ్ల పాటు విపక్షంలో ఉండాల్సిన అవసరం లేదు. అయితే అదే సమయంలో ప్రజల్లో తిరిగి వేగంగా ఆదరణ పెంచుకుంటే తప్ప జమిలీ ఎన్నికలు కూడా వైసీపీకి ఉపయోగపడే అవకాశం లేదు. ఏదేమైనా కేంద్రం జమిలీ ఎన్నికల రూపంలో వైసీపీకి మరో ఛాన్స్ ఇచ్చినట్లువుతుందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ఏపీలో మధ్యంతర ఎన్నికలకి లైన్ క్లియర్ అవ్వడంతో జగన్ చాలా హ్యాపీగా ఉన్నారని ఆయన అనుచరుల సమాచారం. అందుకే ఇప్పుడు జగన్ వేగంగా పార్టీని బలోపేతం చేసుకునే పనిలో ఉన్నారని వారు తెలిపారు. ప్రజలకి జగన్ పట్ల ఉన్న అభిమానం ఏమాత్రం తగ్గలేదని తిరిగి అధికారం చేపట్టడం కోసం ఆయన అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని జగన్ ప్రజల మనిషని వారు ఈ సందర్భంగా చెప్పుకున్నారు. ఏపీలో మధ్యంతర ఎన్నికలు వస్తే ఏం జరుగుతుందో తెలియాలంటే మనం వేచి చూడాల్సిందే.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!