Andrapradesh: తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చిన కాలం నుంచి కూడా ఈవీఎంల గోల చాలా రచ్చ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒంగోలు వైకాపా అభ్యర్ధి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒంగోలులో పన్నెండు కేంద్రాలలో తనకు అనుమానం ఉందని ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశారు. ఆ అనుమానాన్ని నివృత్తం చేసే బాధ్యత ఎన్నికల కమిషన్ చేయకపోగా మాక్ పోలింగ్ చేస్తాము. ఎన్నికలలో మీరు చెప్పిన విధంగా ఇన్వెస్టిగేషన్ అనేది జరగదు అని ఎన్నికల కమిషన్ ఆయనకి తెలియజేసింది. సాధారణంగా ఎన్నికలు ముగిశాక 45 రోజుల పాటు ఈవీఎంల లోని డేటా ని అలాగే వీవీ ప్యాడ్లలోని స్క్రిప్టులని భద్రపర్చాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ కి ఉంటుంది. కానీ ఎన్నికల కమిషన్ అలా చేయలేదు. రీ వెరిఫికేషన్ లాంటివి ఏమి చేయకుండా ఏదో మాక్ పోలింగ్ లాంటివి చేసి ఎన్నికల కమిషన్ చేతులు దులుపు కోవడానికి ప్రయత్నం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. బాలినేని కి హైకోర్ట్ లో తనకి అనుకూలమైన తీర్పు రాకపోతే సుప్రీమ్ కోర్ట్ కి కూడా వెళ్తారని ఆ పార్టీ నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. సుప్రీమ్ కోర్ట్ ఈ విషయంలో ఇప్పటికే ఒక తీర్పు ఇచ్చింది. ఏ అభ్యర్ధి అయినా ఇలా ఫిర్యాదు చేస్తే వాళ్ళ అనుమానం నివృత్తి చేసే బాధ్యత ఎన్నికల కమీషన్ కి ఉంటుంది అని. ఆ ఫిర్యాదుదారుడి ముందే రీ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది అని సుప్రీమ్ కోర్ట్ చెప్పింది. ఈ తీర్పు ఆధారంగానే బాలినేని ఫిర్యాదు చేశారు.
ఈ విషయం గురించి హై కోర్టులో వాదనలు ముగిసి మూడు వారాలు దాటింది. ఇప్పటికే ఈవీఎం లలో డేటా లేదు. వీవీ ప్యాడ్లలోని స్లిప్స్ కాల్చేశాము అంటున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతోనే కాల్చేశాము అని కల్లెక్టర్లు చెప్తున్నారు. వాదనలు ముగిసి మూడు వారాలైనా ఇంకా తీర్పు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అని హై కోర్ట్ ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పుని కూడా హై కోర్ట్ గౌరవించకపోతే ఇక తమకు న్యాయం జరిగేది ఎలా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీర్పు ఎందుకు రిజర్వు చేశారు? వారికి ఏమైనా రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయా వాటికి సమాధానం హై కోర్ట్ తమకి మరియు ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యంలో చాలా కీలకమైన ఓటును రక్షించాల్సిన న్యాయస్థానం మరియు ఎన్నికల కమిషన్ ఇలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం అని వైకాపా నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయండని హై కోర్ట్ ని అభ్యర్ధిస్తున్నారు. సుప్రీమ్ కోర్ట్ తీర్పు చెప్పిన అంశంలో కూడా హై కోర్ట్ ఇలా ప్రవర్తిస్తూ ఇంకా తీర్పు ఇవ్వకపోవడం ఏంటని తమకు న్యాయం జరిగేలా లేదని వైకాపా నాయకులు గగ్గోలు పెడుతున్నారు. మొత్తానికి ఈవీఎం గోల్ మాల్ మీద హై కోర్ట్ ఏం తీర్పు ఇవ్వనుంది అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.