Friday, July 19, 2024

బ్రేకింగ్ : అయ్య‌న్న‌పాత్రుడు అరెస్ట్

- Advertisement -

తెల్ల‌వార‌గానే మనకు ఓ బ్రేకింగ్ వార్త అందుతుంది. అది ఏమింటంటే.. టీడీపీ సీనియ‌ర్ నేత చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడును అరెస్ట్ చేయడం ఇప్పుడు రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది. తరుచు వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు,మంత్రుల మీద అయ్య‌న్న‌పాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. సీఎం జగన్ మీద కూడా నోరు పారేసుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. చెత్తకు పన్ను విధించిన సమయంలో జగన్‌ను చెత్త నా కొడుకు అని కూడా తిట్టారాయన. ఆ సమయంలోనే అయ్య‌న్న‌పాత్రుడును అరెస్ట్ చేస్తారని అందరు భావించారు. కాని అలా ఏమి జరగలేదు. కాని సడన్‌గా అయ్య‌న్న‌పాత్రుడును సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అయ్య‌న్న‌పాత్రుడు ఇంటి ప్రహరీ గోడకు సంబంధించిన విషయంలో ఆయన్ను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన ప్రభుత్వ స్థలంను ఆక్రమించి ప్రహరీ కట్టారని మున్సిపాల్ అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వ స్థలంలో ఉన్న ప్రహరీ గోడను కూల్చివేశారు అధికారులు. అయితే ఆ సమయంలో అయ్య‌న్న‌పాత్రుడు కొడుకు ఆవేశంగా ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. దీనిపై కోర్టుకు కూడా తాము సిద్దంగా ఉన్నామని అయ్య‌న్న‌పాత్రుడు కుమారుడు తెలిపారు. అయితే ఇలా కోర్టుకు వెళ్లడమే ఇప్పుడు వారికి కొత్త కష్టాలు తెచ్చినట్లుగా ఉంది. అయ్య‌న్న‌పాత్రుడు ఇంటి ప్రహ‌రీ గోడ‌కు సంబంధించి కోర్టుకు సంబంధించిన పత్రాలు..ఫోర్జ‌రీ ప‌త్రాలు అని సీఐడీ అధికారులు గుర్తించారు.

కోర్టుకు ఫోర్జ‌రీ ప‌త్రాలు స‌మ‌ర్పించార‌ని సీఐడీ అధికారులు కేసు న‌మోదు చేశారు. ఇందులో భాగంగానే తెల్ల‌వారుజామున అయ్య‌న్న ఇంటికి సీఐడీ అధికారులు వెళ్లి అయ్య‌న్న, ఆయ‌న కుమారుడు రాజేష్ అరెస్ట్‌ చేయడం జరిగింది. వాళ్లిద్ద‌రిపై నాన్‌బెయిల‌బుల్ కేసులు న‌మోదు చేశారు. అనంత‌రం తండ్రీకొడుకుల్ని ఏలూరు కోర్టులో హాజ‌రుప‌రిచేందుకు సీఐడీ అధికారులు రెడీ అవుతున్నారు. అయ్య‌న్న‌పాత్రుడును అరెస్ట్ చేయడం వెనుక వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేయగా.. టీడీపీ నాయకులు మాత్రం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!