Thursday, October 3, 2024

BRS Party:పెద్దాయన కోసం ఎదురుచూస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు

- Advertisement -

BRS Party: కేసీఆర్ నోటి నుంచి వచ్చే మాటలు తూటాల్లా పేలుతాయి. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తాయి. అచ్చమైన తెలంగాణ మాండలికంతో చేసే కామెంట్స్ ముచ్చెమటలు పట్టిస్తాయి. అన్నింటికీ మించి తెలంగాణ ప్రజలకు నచ్చుతాయి. కానీ ఆ మాటలు వినబడి దాదాపు ఐదు నెలలు కావస్తోంది. ఆయన కనిపిండం లేదు. ఆయన మాట వినిపించడం లేదు.కారణం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయంఇవ్వాలని భావిస్తున్నారా? లేకుంటే వ్యూహాత్మకమా? ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ లో ఇదే ఆసక్తికరమైన చర్చ.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దెబ్బతింది. అక్కడకు కొద్దిరోజులకే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తుడుచుపెట్టుకుపోయింది. అప్పటి నుంచి కేసీఆర్ బయటకు కనిపించడం మానేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎర్రవెల్లిలోని తన ఫాం హౌస్‌కే పరిమితమైన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జనంబాట పట్టేదెప్పుడని ఇంటా బయటా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో షాక్‌ తిన్న మాజీ సీఎం.. ఆ తర్వాత కొద్ది రోజులకు కోలుకుని పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినా…. ఆ ఎన్నికల్లోనూ కోలుకోలేని దెబ్బ తిన్నారు. ఇక అదే సమయంలో తన కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అరెస్టు అయి జైలుకు వెళ్లడంతోపాటు ఇతర కారణాల వల్ల బయటకు రాలేకపోయారు కేసీఆర్‌. ఇక ఇప్పుడు అన్నీ సర్దుకున్న తర్వాత కేసీఆర్‌ వస్తారని పార్టీ కార్యకర్తలు ఎదురుచూడటమే కానీ, అధినేత దర్శనం మాత్రం దక్కడం లేదంటున్నారు.

కేసీఆర్‌ ప్రజాక్షేత్రంలో రావాలని డిమాండ్‌ తెలంగాణ ప్రజల నుంచి వినిపిస్తోంది. ఐతే ఇన్నాళ్లు తగిన సమయం కోసం ఎదురుచూసిన కేసీఆర్‌… రైతు రుణమాఫీని ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదన్న సాకు చూపి రైతు యాత్ర చేస్తారని చెప్పింది బీఆర్ఎస్‌ పార్టీ. దీంతో ఇటు బీఆర్‌ఎస్‌ క్యాడర్‌తోపాటు అటు రైతులు కూడా కేసీఆర్‌ రంగంలోకి దిగితే ప్రభుత్వంలో చలనం వస్తుందని ఆశిస్తున్నారు. కానీ కేసీఆర్‌ మాత్రం ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఇక ఈ నెలారంభంలో రెండు రోజుల హోమం నిర్వహించిన కేసీఆర్‌.. యాగం ముగిశాక ప్రజల్లోకి వస్తారని చెప్పారు. కానీ, ఆ సమయమూ ముగిసిపోయింది. దీంతో కేసీఆర్‌ ఎప్పుడొస్తారంటూ అంతా ఎదురుచూస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే నిరాశకు గురవుతున్నారు.

బీఆర్‌ఎస్‌ పార్టీని అన్నీతానై నడిపించిన మాజీ సీఎం కేసీఆర్‌… ఇలా కుదేలైపోవడం కార్యకర్తల్లో చర్చకు దారితీస్తోంది. ఎర్రవెల్లి ఫాం హౌస్‌లో ప్రతి రోజూ కార్యకర్తలను కలుస్తున్న కేసీఆర్… హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయానికి వారంలో ఒకసారైనా వచ్చిపోతే బాగుణ్ణు కదా? అని కోరుకుంటున్నారు కార్యకర్తలు. ప్రస్తుతం కేసీఆర్‌ దూరంగా ఉండటంతో పార్టీ విధాన నిర్ణయాల అమలు బాధ్యత మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ చూస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దాటిని సమర్థంగా ఎదుర్కొనడంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరికి తోడుగా కేసీఆర్‌ కూడా కనిపిస్తే పార్టీకి బూస్ట్‌ వస్తుందనే అభిప్రాయం ఉంది. కానీ కేసీఆర్‌ దూరంగా ఉంటుండటం వల్ల హరీశ్‌ రావు, కేటీఆర్‌ పోరాటానికి సమగ్రత రావడం లేదంటున్నారు.

కేసీఆర్‌ ఎక్కువగా ఫాం హౌస్‌కే పరిమితమవడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా పదే పదే రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్‌ శ్రేణులు భావిస్తున్నాయి. కేసీఆర్‌ను బయటకు రమ్మన్నా రావడం లేదని ఎత్తిచూపుతూ బీఆర్‌ఎస్‌పై రాజకీయంగా పైచేయి సాధించేందుకు సీఎం ఓ పథకం ప్రకారం పావులు కదుపుతున్నారు. సీఎం వ్యూహాలను గమనిస్తున్నారో లేదో కానీ, కేసీఆర్‌ మాత్రం… సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ మంత్రుల వ్యాఖ్యలపై అసలు స్పందించడం లేదు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి సైతం రావడానికి ఇష్టపడటం లేదు. ఈ పది నెలల కాలంలో కేవలం రెండు సార్లు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్‌… ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దీంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు డీలా పడుతున్నాయి. కేసీఆర్‌ మళ్లీ యాక్టివ్‌గా తిరగాలని… తన వాగ్ధాటిని ప్రదర్శించాలని కోరుకుంటున్నాయి. మరి గులాబీ బాస్ మదిలో ఏముందో తెలియాల.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!