vijayavada: ఇటీవల భారీ వరదలతో విజయవాడ నగరంలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి. బుడమేరుకు భారీగా గండ్లు పడటంతో విజయవాడ నగరంలోని పలు కాలనీలకు వరద పోటెత్తింది. గండ్ల వద్ద సమస్య పరిష్కారమై పరిస్థితి చక్కబడడానికి చాలానే రోజులు పట్టింది. కాగా, ఈ సమయంలో మనం ఒక విషయాన్ని తప్పక గుర్తించాలి. బుడమేరు విషయంలో గతంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చిత్తశుద్ధితో అడుగులు వేసినది ఒక్క దివంగత నేత వైయస్ఆర్ మాత్రమే. పోలవరం నీటిని కృష్ణానదిలోకి కలపడానికి తవ్విన పోలవరం కుడికాల్వలోకి బుడమేరును మళ్లించి తద్వారా 37,000 క్యూసెక్కుల నీటిని కృష్ణానదిలోకి మళ్లించాలన్నది ఆరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్ణయం. విజయవాడను పూర్తిగా వరద నుంచి తప్పించాలనే తపనతో పనులు కూడా చేశారు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నది ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిన విషయం.
అధికారంలోకి వచ్చి తాను సీఎం పదవిని అనుభవించేందుకు సహకారం అందించినందుకు 1998 ఏప్రిల్ 13న 2 ప్లాంట్ల నిర్మాణానికి రాధాకృష్ణకు చెందిన యాక్టివ్ పవర్ ప్లాంట్‌కు చంద్రబాబు అనుమతి ఇచ్చినది నిజమే కదా? 2005లో బుడమేరుకు 70 వేల క్యూసెక్కుల వరద రావడంతో విజయవాడ ముంపుకు గురైంది. ఆ సమస్య నుంచి శాశ్వత పరిష్కారం కోసం గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు పకడ్బందీ చర్యలు చేపట్టారు. బీడీసీ సామర్థ్యాన్ని 37,555 క్యూసెక్కులకు పెంచేలా ప్రణాళికలు రూపొందించారు. రూ.241.45 కోట్లతో ఆ పనులు చేపట్టేలా 2008 ఆగస్టు 12న నాటి సీఎం వైఎస్సార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే.. బీడీసీ ఆధునీకకరణ పనుల కోసం 2021లో గతంలో ఇచ్చిన ఎన్‌ఓసీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇదంతా బాగానే ఉందనుకున్నా 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు బుడమేరు ముంపు నివారణపై దృష్టి సారించలేదు? నిధులు ఉన్నా కూడా ఎందుకు ఖర్చు చేసి అభివృద్ధిని గురించి పట్టించుకోలేదు? బుడమేరు ఆధునీకరణ పనులు చేస్తానంటే ఎవరైనా అడ్డుకుంటారా?? మరి ఎందుకు ఈ అలసత్వం? 14 ఏళ్లు అధికారంలో ఉండి ఏ రోజు కూడా బుడమేరు ఆధునీకరణను పట్టించుకోని చంద్రబాబు.. ఇప్పుడు వరదల సమయంలో మాత్రం ఆపద రాగానే ప్రజలను నమ్మించేలా అబద్ధాలు చెబితే అంత తేలిగ్గా నమ్మేస్తామా?