YS JAGAN: జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో ప్రక్షాళన చేపట్టి పార్టీ నాయకులకు షాకిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడిపోవడంతో జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఎవరూ ఊహించని వారికి పదవులు కేటాయించారు. పార్టీలో మొదటి నుంచి కష్టపడిన వారికి పదవులు కేటాయిస్తున్నారు. దీనిలో భాగంగానే జగన్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. జిల్లాల వారీగా పార్టీలో నియామకాలు కొనసాగిస్తున్నారు. జిల్లా అధ్యక్షులతో పాటుగా నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ఖరారు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఎన్నికల ముందు పలువురి నియోజకవర్గాలను మార్పు చేశారు. ఆ ప్రయోగం విఫలమైంది. దీంతో, ఇప్పుడు చర్యలు మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే ఉమ్మడి కృష్టాజిల్లాలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పేర్ని వెంకట్రామయ్య(నాని) నియమించారు. ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దేవినేని అవినాష్‌ను జగన్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కైలే అనిల్ కుమార్‌ను జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను నియమించారు.
అలాగే మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో మురుగుడు లావణ్య అక్కడ నుంచి పోటీ చేసి నారా లోకేష్ చేతిలో ఓడిపోయారు. దీంతో ఆమెను నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి ఆ స్థానంలో శంకర్ రెడ్డిని వైసీపీ సమన్వయకర్తగా నియమించడం జరిగింది. గుంటూరు, నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నియమించారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి అంబటి రాంబాబు నియమించడం జరిగింది. ఇలా పార్టీలో మొదటి నుంచి కష్టపడిన వారికి పదవులు కేటాయిస్తూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు ఇచ్చారు.