Sunday, October 13, 2024

Chandrababu: చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు.. వైసీపీపై సంచలన ఆరోపణలు

- Advertisement -

Chandrababu: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయం కోసం ఎంతటి నీచానికైనా సిద్దపడతాడని మరోసారి రుజువైంది. అబద్దపు హామీలు, దౌర్జన్యపు రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని అల్లకల్లోల పరిస్థితిలో వదిలేశారు. ఇదిలా ఉండగా.. తెలుగువారికే కాదు.. ప్రపంచం మొత్తం గర్వంగా చెప్పుకునే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ విషయంలో చంద్రబాబు వైఖరిని ప్రజలు మాత్రమే కాదు.. టీటీడీలో నాలుగేళ్ల పాటు ఛైర్మన్‌గా ఉన్న ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కూడా ఖండించడం గమనార్హం.

తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే అందరికీ చాలా సెంటిమెంట్. తిరుమల లడ్డూ ప్రసాదం లేకుండా ఎవరూ వెనుదిరిగి రారు. అంతటి ప్రాచుర్యం ఉన్న ప్రసాదం మీద ఏకంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బ తీశారని, చంద్రబాబు ఏ విషయంలోనైనా రాజకీయ లబ్ది మాత్రమే ఆశిస్తారని ఫైర్ అయ్యారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని ఉద్దేశిస్తూ.. గత వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి దిగజార్చే ప్రయత్నం చేశారు. లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు ఉపయోగించారని అర్థం లేని ఆరోపణలు చేశారు. అన్నప్రసాదంలో నాసిరకం భోజనం పెట్టరాని, దేవస్థానం పరువు దిగజార్చడానికి కుట్ర పన్నారని వైసీపీపై అబాంఢాలు వేస్తూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం ఏ మాత్రం సరికాదని అన్నారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా చంద్రబాబు వ్యాఖ్యలను సవాలు చేస్తూ తాను తిరుమలలో ప్రమాణానికి వస్తానని.. ఆ ధైర్యం బాబుకు ఉందా అంటూ వైవీ సుబ్బారెడ్డి ఛాలెంజ్ చేశారు. ఏది ఏమైనా ఒక పవిత్ర పుణ్యక్షేత్రాన్ని కూడా తన రాజకీయం కోసం చంద్రబాబు అపహాస్యం చేయడం, తన రాజకీయ లబ్ది కోసం భగవంతుడి పేరు వాడుకోవడం ఎంతవరకు సమంజసమని వైసీపీ ఖండిస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!