Friday, October 4, 2024

Mega Star Chiranjivi: రేవంత్ కు చిరంజీవి దండం…మళ్లీ రచ్చ స్టార్ట్

- Advertisement -

Mega Star Chiranjivi: మెగా స్టార్ చిరంజీవి వివాద రహితుడు. ఎప్పుడు ప్రశాంతంగా కనిపిస్తారు. ఎదుటివారిని గౌరవిస్తారు. కానీ ఆయన చుట్టూ వివాదాలు అల్లే ప్రయత్నాలు మాత్రం ఎపుడూ జరుగుతూ ఉంటాయి. ఆయన రాజకీయాల్లో లేకపోయినా ఆయన గురించి ప్రత్యక్షంగా పరోక్షంగా చర్చ సాగిస్తూ ఆయనను ముగ్గులోకి లాగుతూ ఏదో విధంగా ఆయన పేరుని తలచే వారూ ఎపుడూ ఉంటారు. లేటెస్ట్ గా చూస్తే చిరు మర్యాద మంచితనమే మరో మారు సోషల్ మీడియా వేదికగా వివాదానికి దారి తీసేలా కొందరు సబ్జెక్ట్ గా చేసుకుని రచ్చ చేస్తున్నారు.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ సీఎం రేవంత్ ను కలిశారు. వరద బాధితుల సహాయార్ధం చెక్కును అందించారు. దీంతో రేవంత్ స్పందించారు. తన చాంబర్ కి వచ్చిన మెగా స్టార్ ని శాలువతో రేవంత్ రెడ్డి సత్కరించారు. అదే సమయంలో చిరంజీవి రేవంత్ రెడ్డికి రెండు చేతులూ జోడించి నమస్కారం పెట్టారు. ఇపుడు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగాస్టార్ తన కంటే పన్నెండు ఏళ్ళు చిన్న అయిన రేవంత్ రెడ్డికి నమస్కరించారని ఆ సమయంలో రేవంత్ రెడ్డి నవ్వుతూ కెమెరా వైపు చూస్తున్న విజువల్ బయటకు వచ్చింది. దాంతో స్టార్ట్ అయింది రచ్చ. ఆనాడు ఏపీ సీఎం జగన్ కి మెగా స్టార్ దండం పెడితే గొడవ చేశారని ఇపుడు ఏమంటారు అని ఒక సెక్షన్ సోషల్ మీడియాలో దూకుడు చేస్తూంటే.. మరో సెక్షన్ అయితే చిరంజీవికి రేవంత్ రెడ్డి శాలువా కప్పుతున్నారు కాబట్టి ఆయన రెండు చేతులూ ప్రతి నమస్కారానికి అవకాశం ఇవ్వలేదని సమర్ధిస్తున్నారు.

సరిగ్గా మూడేళ్ళ క్రితం అనాడు ఏపీ సీఎం గా ఉన్న జగన్ వద్దకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు అంతా చిరంజీవి నాయకత్వంలో వెళ్ళి కలిశారు. ఈ సందర్భంగా చలన చిత్ర సమస్యలను చెబుతూ మెగాస్టార్ దండం పెట్టారు జగన్ కి. అయితే జగన్ మాత్రం తన రెగ్యులర్ బాడీ లాంగ్వేజ్ తోనే రెండు చేతులూ కట్టుకుని నవ్వుతూ చూస్తున్నారు. అప్పట్లో అది రచ్చకు దారితీసింది. ఒక విదంగా చెప్పాలంటే సినీ పరిశ్రమ వైసీపీకి వ్యతిరేకంగా మారడానికి కారణమైంది. అప్పటి నుంచి పవన్ సైతం తన అన్నయ్య చిరంజీవిని అవమానించారంటూ చెప్పుకున్నారు. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఓ ప్రధాన సామాజికవర్గం వ్యతిరేకించింది కూడ.

ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా చిరంజీవి దండం పెట్టడంతో పాత వివాదం కొత్తగా మిక్స్ చేసి మళ్ళీ సోషల్ మీడియా వార్ కి కొందరు తెర తీశారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే చిరంజీవి అక్కడ ఎదురుగా ఉన్న వారి వయసు చిన్న అయినా వారు సీఎం అన్న కారణంగా రెస్పెక్ట్ ఇచ్చి దండం పెడుతున్నారు అయితే దాని మీద కూడా వివాదాలు చోటు చేసుకోవడంతో చిరు దండానికి ఒక దండం అన్నట్లుగానే సీన్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ వివాదం ఎటుదారి తీస్తుందోనన్న ఆందోళన కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!