BIG BREAKING : ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి భారతీయ జనతా పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి అయితే రాగలిగారు కానీ ప్రజల మనస్సులో స్థానం సంపాది౦చుకోలేకపోయారు. అలాగే ప్రజల మనస్సులో జగన్ కి ఉన్న స్థానాన్ని వారు భర్తీ చేయలేకపోయారు. జగన్ ని ప్రజల అభిమానం నుంచి దూరం చేయలేకపోయింది ఈ కూటమి. జగన్ అడుగు బయట పెడితే చాలు జన సందోహం భారీగా ఉంటోంది. ఆయనకి లభిస్తున్న భారీ ప్రజాదరణ చూస్తుంటే ప్రజలకి ఆయన పట్ల ఉన్న అభిమానం ఏ మాత్రం తగ్గలేదు అని చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన గెలుపుని సార్ధకం చేసుకునే పనిలో కాకుండా జగన్ మోహన్ రెడ్డి పార్టీ అనుచరుల పైన వారి కార్యకర్తలపైన కక్ష పూరిత రాజకీయాలు చేయడం వారికి తగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే తమకు మేలు జరిగిందని ప్రస్తుతం కూడా ఆయన పాలన ఉంటే బాగుండేదని ఇప్పటికే ప్రజలు భావిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చాక ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిన వైనాన్ని ప్రజలు అసలు స్వాగతి౦చలేకపోతున్నారు. ఎన్నికల ముందు కురిపించిన హామీల వర్షంలో ఒక్కటంటే ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదు అని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధికారం చేపట్టిన కేవలం నాలుగు నెలల్లోనే ప్రజల్లో ఈ స్థాయిలో వ్యతిరేకత రావడం అంటే ఇంకా భవిష్యత్తులో ఈ కూటమి ప్రభుత్వం ఎంత పతనాన్ని చెవి చూడబోతుంది అని రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం నడుస్తోన్న చర్చ. ప్రచార ప్రభావమో లేకపోతే ఎల్లో మీడియా దుష్ప్రచారాల వల్ల కావొచ్చు మొత్తానికి అయితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు కానీ ప్రజల మనసుల్లో స్థానాన్ని సంపాది౦చుకోలేకపోయారని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. ఈ వ్యతిరేకత కారణంగా కూడా జగన్ కి ప్రజాదరణ మరింత పెరుగుతుందని ఆయన హయాంలో జరిగిన మంచి పనుల గురించి ప్రజలు ఇప్పుడు ఇంకా బాగా గుర్తిస్తున్నారని ఇది వారి పార్టీకి మంచి చేకూరుస్తుందని వైసీపీ కార్యకర్తలు భావిస్తున్నట్లు సమాచారం.
నాలుగు నెలల్లోనే ఈ స్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత ఉంటే ఇక ముందు ముందు కాలంలో ఎలా ఉంటుందో అనే భయంతోనే కేంద్రంలో ఉన్న పెద్దల తీరులో మార్పుకు కారణమా అంటే కచ్చితంగా అవుననే అంటున్నారు వైసీపీ నాయకులు. కేవలం కేంద్రంలో అధికారం కోసమే ఎన్డీఏ లో చంద్రబాబుని భాగస్వామిగా చేసుకున్న ఎన్డీఏ సర్కార్ ఇప్పుడు చంద్రబాబు మరియు పవన్ వైఫల్యం కారణంగా వారిని దూరం పెట్టారని వారు ఆరోపించారు. చంద్రబాబు మరియు పవన్ తో జతకట్టి తప్పు చేసామా అనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. ఇది ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్ లో తమకు భవిష్యత్తు ఉండబోదని రాబోయే కాలంలో జగన్ తో జతకట్టేందుకు మోడీ ఆసక్తి చూపిస్తున్నారని వైసీపీ పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే ఆయన త్వరలో ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం