Tuesday, October 8, 2024

Hydra: హైడ్రాపై సామాన్యుల కన్నెర్ర.. రేవంత్ సర్కారుపై తిట్ల దండకం

- Advertisement -

Hydra: తెలంగాణలో ఎక్కడ చూసిన ఎవరు నోట విన్న హైడ్రా అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. ముఖ్యంగా చెరువులు, బఫర్ జోన్ లు, ఎఫ్టీఎల్ పరిధిలను ఆక్రమించుకుని చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వారి కట్టడాలనుకూడా కూల్చివేస్తోంది. హైడ్రా కాన్సెప్ట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా పోలీసుల్ని సైతం కేటాయించారు. హైడ్రాకు ప్రత్యేక అధికారాలు, సిబ్బందిని సైతం కేటాయించారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన అనంతంరం హైడ్రా మరింత ఊపు మీద అక్రమ నిర్మాణాల్ని కూల్చివేస్తోంది. అయితే పెద్దలను వదిలి పేదల జోలికి వస్తుండడంతో విమర్శలు వస్తున్నాయి. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిట్ల దీవెనలతో రెచ్చిపోతున్నారు. అనవసరంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సర్కారునే గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

సాధారణంగా వారంతం వస్తే అంతా సంబరపడతారు. కానీ వీకెండ్ వచ్చిందంటే చాలూ జంట నగరాల ప్రజలకు హడలే. హైడ్రా చేస్తున్న రచ్చ మాములుగా లేదు. ఈ నేపథ్యంలో.. హైడ్రాను కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం తిట్టిపోస్తున్నారు. కేవలం పేదల మీద హైడ్రా జులూం కోనసాగుతుందని అంటున్నారు. అంతేకాకుండా.. డబ్బున్న వాళ్లకు నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారని, కేవలం పేదల మీద ప్రతాపం చూపిస్తున్నారని కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కాయా, కష్టం చేసి పైసా, పైసా కూడబెట్టి, లోన్ లు తీసుకుని ఇళ్లు కొనుక్కున్నామని కూడా ప్రజలు తీవ్రంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరబాద్ లో ప్రస్తుతం హైడ్రా అక్రమకట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

అమీన్ పూర్ లో ఇటీవల ఒక భవనాన్ని హైడ్రా అధికారులు నెల మట్టం చేశారు. అయితే.. అది కోర్టు పరిధిలోకేసు పెండింగ్ లో ఉంది. బాధితులు సైతం ఇదే విషయాన్ని హైడ్రాకు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. కానీ అధికారులు మాత్రం అవేమి పట్టించుకోకుండా.. ఆ భవనాన్ని నెల మట్టం చేశారు. దీంతో బాధితుడు హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. హైడ్రా రంగనాథ్ పై సీరియస్ అయ్యింది.కోర్టులో పెండింగ్ లో ఉన్నభవంతిని ఎలా కూల్చేస్తారంటూ కూడా మండిపడింది. దీనిపై వెంటనే వచ్చే సోమవారం నాడు..వ్యక్తిగతంగా లేదా వర్చువల్ గా కోర్టు ఎదుట హాజరై సమాధానం చెప్పాలని కూడా రంగనాథ్ కు నోటీసులు జారీ చేసింది. మరోవైపు తెలంగాణలనో మూసీ నది, చైతన్య పురి పలు ఇతర ప్రాంతాలలో హైడ్రా కూల్చివేతలు చేస్తామని మార్కులు పెట్టుకునేందుకు అధికారులు వచ్చారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బాధతులు ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నామని, ఇప్పుడు తమ ఇళ్లను కూలగొడితే ఎక్కడకు వెళ్లాలని కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సీఎం రేవంత్ కు శాపనార్థాలు సైతం పెడుతున్నారు.

హైడ్రా చేస్తున్న రచ్చ ఎటుదారితీస్తుందోనన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా నడుస్తోంది. రేవంత్ సొంత అజెండా అమలుచేస్తున్నారన్న అనుమానం కూడా ఉంది. కేవలం తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడం కోసమే హైడ్రాను తెచ్చారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఇప్పుడు పెద్దవాళ్ల జోలికి కూడా వెళ్లడం లేదు. దీంతో హైడ్రాపై ఒక రకమైన అనుమానాపు చూపులు ప్రారంభమయ్యాయి. ఇదే విషయాన్ని బాధితులు ప్రస్తావిస్తున్నారు. రేవంత్ సర్కారు చర్యలను తప్పుపడుతున్నారు. అయితే మారిన హైడ్రా స్టైల్ చూసి పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి మంచి కంటే చెడు చేస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!