Sunday, October 13, 2024

Telangana: తెలంగాణ సమాజాన్ని అవమానించిన కాంగ్రెస్

- Advertisement -

Telangana: తెలంగాణ తల్లిని కాంగ్రెస్ అవమానించిందా? తెలంగాణ తల్లి స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నెలకొల్పడం తెలంగాణ సమజాం వ్యతిరేకిస్తోందా? ఈ విషయంలో రేవంత్ సర్కారు దూకుడు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న పరిణామాలు ఆ పార్టీకి వ్యతిరేకంగా మారుతున్నాయి. తాజాగాతెలంగాణ రాజకీయాల్లో విగ్రహాల వివాదం చెలరేగింది. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ భారీ విగ్రహాన్ని హైదరాబాద్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వద్ద ఆవిష్కరించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆవిష్కరించిన పరిస్థితుల్లో ఈ వివాదం కాస్తా పతాక స్థాయికి చేరింది.

సాధారణంగా తెలంగాణలో సెంటిమెంట్ అధికం. ఇటువంటి తరుణంలో సచివాలయం వద్ద నిర్మించిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ విగ్రహం అక్కడ నెలకొల్పడం రాజకీయంగా దుమారం రేపుతోంది. తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నెలకొల్పడం ఏమిటంటూ భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.అయితే రాజకీయంగా టార్గెట్ చేయడంలో కేటీఆర్ అందివేసిన చేయి. అందుకే కాంగ్రెస్లో ఒక రకమైన ఆందోళన కలిగిస్తోంది. అనవసరంగా తెలంగాణ తల్లిని మార్చి రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుచేశామా? అన్న డిఫెన్స్ కనిపిస్తోంది.

అయితే ఇది బీఆర్ఎస్ కు ప్రచార అస్త్రంగా మారింది. తెలంగాణ తల్లిని అవమానిస్తారా?, తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా?, తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారా? అంటూ ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా?, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా?, తెలంగాణ మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా?, తెలంగాణ అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా? అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఈ విషయాన్ని మరోసారి లేవనెత్తారు బీఆర్ఎస్ నేత కల్వకుంట తారక రామారావు అలియాస్ కేటీఆర్. . విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

అయితే ఈ విషయంలో సీఎం రేవంత్ ను టార్గెట్ చేసుకోవడం విశేషం. తెలంగాణ సమాజాన్ని అవమానిస్తూ రేవంత్ రెడ్డి చేసిన తప్పును తాము సరిదిద్దుతామని కేటీఆర్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం- అమరజ్యోతి నడుమ తెలంగాణ తల్లి కొలువుదీరాల్సిన చోట పెట్టిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని తేల్చి చెప్పారు. తెలంగాణ భవిష్యత్ తరాలకు, ఇక్కడి సమాజానికి మార్గదర్శిగా ఉండాల్సిన ఆ స్థలంలో రాజీవ్ గాందీ విగ్రహాన్ని నెలకొల్పడం ఏ మాత్రం సరికాదని అన్నారు. భవిష్యత్ పాలకులకు స్ఫూర్తిని నింపేలా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మాత్రమే ఉండాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.దీంతో ఇదో రాజకీయ అంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా మారి బీఆర్ఎస్ కు అడ్వంటుజ్ గా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!