Friday, October 4, 2024

BRS- CONGRESS:బీఆర్ఎస్ కు కౌంటర్ ఇవ్వలేకపోతున్న కాంగ్రెస్.. సోషల్ మీడియాను నమ్ముకున్న రేవంత్

- Advertisement -

BRS- CONGRESS: ఇప్పుడంతా డిజిటల్ మీడియా హవా నడుస్తోంది. క్షణాల్లో ప్రతికూల, అనుకూల వార్తలను వైరల్ చేస్తున్నారు. అందుకే అన్ని రాజకీయ పార్టీలు వాటికే ప్రాధాన్యమిస్తున్నాయి. సొంత సోషల్ మీడియా సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. కీలక నేతలు సైతం సొంత డబ్బులు పెట్టుకొని వ్యక్తిగతంగా సోషల్ మీడియా వింగ్ ను నడుపుతున్నారు. అయితే తెలంగాణలో మాత్రం సోషల్ మీడియాను వినియోగించుకోవడంలో బీఆర్ఎస్ ముందుంది. 2028 నాటికి మరో సారి తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న గులాభీ పార్టీ.. పార్టీ అనుబంధ విభాగాల కంటే సోషల్ మీడియాకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుండడం విశేషం. అయితే ఈ విషయాన్ని గమనించిన సీఎం రేవంత్ జాగ్రత్త పడుతున్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ ను బలోపేతం పై ఫోకస్ పెట్టారు.

ఇప్పుడు ఎన్నికలతో పని లేదు. సాధారణంగా పార్టీల మధ్య నిత్యం సోషల్ మీడియాలో విమర్శలు, ప్రతివిమర్శలు చూస్తూనే ఉంటాం. లేదంటే స్కామ్‌లు, అవినీతి అక్రమాలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తుంటారు. ఒకవేళ ప్రభుత్వాలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే.. ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న సేవలను, అమలు చేస్తున్న పథకాలను, తీసుకుంటున్న కొత్త కొత్త నిర్ణయాలను ఎప్పటికప్పుడు అందులో పోస్ట్ చేస్తుంటారు. రోజూ పార్టీల మధ్య, అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఏదో ఒక రచ్చ సైతం సోషల్ మీడియాను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వారికి కనిపిస్తూనే ఉంటుంది. ఒకనొక సందర్భాల్లో సోషల్ మీడియా పార్టీల గెలుపు, ఓటములపైనా ప్రభావితం చూపిస్తున్న దాఖలాలూ ఉన్నాయి. అందుకే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వెంగులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి.

తెలంగాణకు వచ్చేసరికి అన్ని పార్టీలకు సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి. నిత్యం ఆయా పార్టీలు, ఆయా పార్టీల నేతల అప్‌డేట్స్ అందులో పడుతూనే ఉంటాయి. అయితే.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాను వాడడంలో అన్ని పార్టీల కంటే ముందుంది. మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్న ఎక్స్ అకౌంటులో ఆ పార్టీ చాలావరకు యాక్టివ్ రోల్ పోషిస్తోంది. ముందు నుంచీ ఆ పార్టీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ సైతం అటు నేతలకు, ఇటు కార్యకర్తలకు చాలా సందర్భాల్లోనూ సూచించారు.అయితే అన్నివేళలా వ్యూహాలు పనిచేయవు. ఈ క్రమంలో ఇటీవల రాష్ట్రంలో గులాభీ పార్టీ అధికారం కోల్పోయింది.అయినా సరే సోషల్ మీడియా వింగ్ ను మాత్రం ఆ పార్టీ నిత్యం బలోపేతం చేసుకుంటూ వస్తోంది.

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యత చేపట్టి కూడా పది నెలలు గడిచింది. అయితే రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆయనపై అటాక్ చేస్తూనే ఉంది. నిత్యం సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపుతున్నారు. నిత్యం పదుల సంఖ్యలో పోస్టు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పై విరుచుకుపడుతోంది. కేటీఆర్ నిత్యం రేవంత్ పై, కాంగ్రెస్ పార్టీపై, ప్రభుత్వంపై ట్వి్ట్టర్ వేదికగా ఫైర్ అవుతూనే ఉన్నారు. ఆయనతోపాటే హరీశ్ రావు, ఇంకా చాలా మంది నేతలు తమతమ అభిప్రాయాలను, విమర్శలను పంచుకుంటున్నారు.అయితే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి తాము సరైన కౌంటర్ ఇవ్వలేకపోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంచనాకు వచ్చారు పార్టీ నుంచి కానీ, ప్రభుత్వం తరఫున కానీ అంత స్థాయిలో కౌంటర్ ఇవ్వలేకపోతున్నామని నేతలతో అన్నారట. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని నిర్ణయం తీసుకున్నారని టాక్. ఎంతసేపూ ప్రెస్‌మీట్లు పెట్టి కౌంటర్లు ఇస్తున్నప్పటికీ.. వాటికి మీడియాలో ప్రచారం లభిస్తున్నప్పటికీ అంతగా మైలేజ్ రావడం లేదని రేవంత్‌ మనసులో నాటుకుపోయినట్లు తెలిసింది.

అయితే కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య విభేదాలు కూడా కౌంటర్ ఇవ్వలేకపోవడానికి ప్రధాన కారణంగా గుర్తించినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టడానికి నేతలపై ఆధారపడడం కంటే.. సోషల్ మీడియాను నమ్ముకోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చారు. అందుకే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాతోపాటు ప్రభుత్వంలోని ఆయా విభాగాలకు సంబంధించిన అధికారిక ఎక్స్ అకౌంట్లను మరింత యాక్టివ్ చేయాలని ఆదేశాలిచ్చారని సమాచారం. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై అప్పటికప్పుడు ఆయా విభాగం నుంచే కౌంటర్ వెళ్లాలని సూచించారట. సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి పాజిటివిటిని తీసుకెళ్లాలని ఆయన ఉద్దేశమని తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు, కాంట్రాక్టులు, టెండర్లు ఇలాంటి విషయాల్లో బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు వెంటనే అంతే స్పీడుతో కౌంటర్ అటాక్ చేయాలని సూచించినట్లు తెలిసింది. అయితే సీఎం రేవంత్ కు లోలోపల భయం పట్టుకున్నట్టు ఉందని బీఆర్ఎస్ అనుమానిస్తోంది. ఎన్నిచేసినా అది వ్రథా ప్రయాసలేనని చెబుతోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!