Thursday, October 3, 2024

Chandrababu: తనని టార్గెట్ చేసిన చంద్రబాబు కి బిగ్ ఝలక్ ఇచ్చిన దేవినేని అవినాష్

- Advertisement -

Chandrababu: ఇప్పుడు ఏపీ పోలీసులు వెతుకుతున్న వ్యక్తులలో అతి ముఖ్యమైన వ్యక్తి దేవినేని అవినాశ్ S/O దేవినేని నెహ్రూ. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి కేసులో అవినాష్ తో పాటు, అతని ముఖ్య అనుచరులు ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అవినాశ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో హైకోర్టు బెయిలు నిరాకరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన అవినాష్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు. దీంతో పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వైసీపీ హయాంలో టీడీపీ మీద, చంద్రబాబు మీద, లోకేష్ మీద అవినాష్ తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా పార్టీ కార్యాలయం మీద దాడి చేయడంతో ప్రస్తుతం అతడు టార్గెట్ అయ్యాడు. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ నేత‌, బాప‌ట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

అయితే ఇక్కడ అవినాశ్ తండ్రి దేవినేని నెహ్రూ టీడీపీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు కావడం గమనార్హం. అవినాశ్ కుటుంబానికి టీడీపీతో విడదీయలేని బంధం ఉంది. వీరి సమీప బంధువు దేవినేని ఉమ కూడా టీడీపీలో కీలక నేత మరియు మాజీ మంత్రి. దేవినేని ఉమతో పాటు ఆయన సోదరుడు దేవినేని వెంకటరమణ కూడా టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. దేవినేని నెహ్రూ కంకిపాడు నియోజకవర్గం నుండి 1983, 1985, 1989, 1994 ఎన్నికల్లో టీడీపీ తరపున వరసగా విజయం సాధించాడు. తెలుగుదేశం పార్టీ విడిపోయినప్పుడు ఎన్టీఆర్ వైపు ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యాడు. 2009, 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత తిరిగి టీడీపీలో చేరాడు. ఆ తర్వాత కిడ్నీ వ్యాధితో బాధపడుతూ 2017లో మరణించాడు.

2016లో తండ్రితో కలిసి తిరిగి టీడీపీలో చేరిన అవినాశ్ తెలుగుదేశం పార్టీ యువత రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేశాడు. 2019 ఎన్నికల్లో గుడివాడ శాసనసభ స్థానం నుండి కొడాలి నాని మీద పోటీ చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుండి వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ చేతిలో ఓడిపోయాడు. విజయవాడ అంటే దేవినేని, దేవినేని అంటే టీడీపీ అన్నట్లు ఉండేది ఒకప్పుడు. అయితే 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో చేరిన అవినాశ్ టీడీపీ, చంద్రబాబు, లోకేశ్ ల మీద ఎవరూ చేయనన్ని విమర్శలు చేసి టార్గెట్ గా నిలిచాడు. కావాలనే తనని టార్గెట్ చేశారని దేవినేని అవినాష్ అనుచరులు చంద్రబాబు పట్ల ఆయన ప్రభుత్వ వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో కావాలనే ఆయన్ని ఇరికించారని తనకి ఎలాంటి సంబంధం లేదని ఈ విషయం గురించి అవినాష్ సుప్రీమ్ కోర్ట్ కి కూడా వెళ్ళడానికి సిద్ధమే అని వారు తెలిపారు. న్యాయం తన వైపే ఉందని కచ్చితంగా అవినాష్ నిర్దోషిగా బయట పడతాడని వారు ధీమా వ్యక్తం చేశారు. ఒక విధంగా చూస్తే అవినాష్ సుప్రీమ్ కోర్ట్ కి వెళ్తాడని చంద్రబాబు ఊహించి ఉండరు కాబట్టి ఇది ఆయనకి పెద్ద ఝలక్ అని వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!